క్యారెక్టర్ నచ్చకున్నా.. షారుఖ్‌ఖాన్‌ కోసమే ఆ సినిమాలో నటించా: సత్యరాజ్ (Sathyaraj)

Updated on Jun 06, 2022 06:36 PM IST
చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో సత్యరాజ్ (Sathyaraj)
చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో సత్యరాజ్ (Sathyaraj)

బాహుబలి, మిర్చి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు సత్యరాజ్ (Sathyaraj). రెబల్‌స్టార్‌‌ ప్రభాస్‌ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో, కట్టప్ప పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా, వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటున్న సత్యరాజ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఓ స్టార్‌ హీరో చేసిన సూపర్‌హిట్‌ సినిమాలో, తన క్యారెక్టర్‌‌ నచ్చకున్నా.. ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకున్నానని తెలిపారు. అది కూడా ఆ హీరో కోసమేనని అన్నారు.  ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ సత్యరాజ్‌ చెప్పిన స్టార్ హీరో ఎవరు? ఆ సూపర్‌‌ హిట్‌ సినిమా ఏంటి? అన్న విషయానికి వస్తే..   బాలీవుడ్‌  'బాద్‌ షా' షారుఖ్‌ ఖాన్‌, దీపికా పడుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషించారు . బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’.

ఈ సినిమాలో దీపికకు తండ్రిగా సత్యరాజ్‌ నటించారు.  లోకల్‌ మాఫియా నాయకుడి పాత్రలో ఆయన కనిపించారు. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. అయినప్పటికీ సత్యరాజ్‌ క్యారెక్టర్‌‌కు ప్రేక్షకుల్లో అనుకున్నంతగా గుర్తింపు లభించలేదు.

చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో సత్యరాజ్ (Sathyaraj), దీపికా పడుకొణె, షారూఖ్‌ఖాన్

తొమ్మిది సంవత్సరాల తర్వాత

ఈ సినిమా రిలీజై దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడిచింది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో ఆయన క్యారెక్టర్‌‌ విషయంపై తాజాగా సత్యరాజ్‌ స్పందించాడు.

‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో క్యారెక్టర్‌‌ కోసం చిత్ర యూనిట్‌ నన్ను సంప్రదించింది. కథలో నా పాత్ర వినగానే.. నాకంత గొప్ప క్యారెక్టర్‌‌గా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుఖ్‌ఖాన్‌కు, దర్శకుడు రోహిత్‌ శెట్టికి తెలిపాను. కానీ, చివరికి షారుఖ్‌ఖాన్‌పై ఉన్న అభిమానం తో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో నటించాల్సి వచ్చింది.

షారుఖ్‌ అంటే నాకు ఎప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను చాలాసార్లు చూశాను. ఆయన నటన నాకెంతగానో నచ్చింది. ఆయనతో నటించాలనే ఉద్దేశంతో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాకు ఓకే చెప్పాను’ అని సత్యరాజ్‌ (Sathyaraj) చెప్పుకొచ్చాడు.

Read More: సలార్ దర్శకుడు 'ప్రశాంత్ నీల్' కి తన స్టైల్‌లో... బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రభాస్ !

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!