Mega Hero Varun Tej: షారుఖ్ తో నటించడానికి సిద్దమే.. బాలీవుడ్ ఎంట్రీ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Updated on Jun 19, 2022 03:26 PM IST
హీరో షారుఖ్ ఖాన్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Shah Rukh Khan, Mega Prince Varun Tej)
హీరో షారుఖ్ ఖాన్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Shah Rukh Khan, Mega Prince Varun Tej)

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ (Mega Hero Varun Tej) ముందు వ‌రుస‌లో ఉంటాడు. రొటీన్‌కు భిన్నంగా సినిమాల‌ను చేస్తూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ హీరో. కాగా, వ‌రుణ్ తేజ్ త‌న కెరీర్ ప్రారంభం నుంచే విభిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్ర‌తి సినిమాకు న‌ట‌న‌ను మెరుగు ప‌రుచుకుంటూ వ‌స్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ హీరో వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తూ తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. కాగా, ఇటీవ‌లే ఈయ‌న న‌టించిన ఎఫ్‌-3 విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈయ‌న ఓ ఇంట‌ర్వూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని మెగా హీరో వరుణ్ తేజ్ అన్నాడు. ఎందుకంటే అతనితో నటించడం నా డ్రీమ్. ఒకసారి మాత్రమే కాదు అవకాశం వస్తే రణబీర్ కపూర్ తో నటిస్తాను సరైన స్క్రిప్ట్ దొరికితే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎఫ్-3 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించాడు.

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా దక్షిణాది చిత్రాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణాది చిత్రాలు వర్సెస్ బాలీవుడ్ పై ఆయన తాజాగా పెదవి విప్పారు. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంటున్నాయని, అందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అవకాశం వస్తే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. 

కాగా.. బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే ఏ హీరోకి ఓవర్సీస్ లో లేని మార్కెట్ షారుఖ్ కి ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేయడంలో షారుఖ్ ఎప్పుడూ కూడా ముందుంటాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో షారుఖ్ సినిమాలు ఉంటాయి.

ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుండి షారుఖ్ తన స్టామినాకి తగ్గ హిట్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే.. షారుఖ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకులతో పాటు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.

వ‌రుణ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ.. తన స్కూల్ చదివే రోజుల్లో.. అమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన లగాన్ విడుదలైంది. దక్షిణాదిలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా ఎక్కడైనా సత్తా చాటడంలో..లోన ఉండే కంటెంట్ బట్టి ఉంటుంది. “RRR”, “KGF”, “బాహుబలి 2” మరియు “లాగాన్” రుజువు చేయడం జరిగింది.

మన దేశం ప్రేక్షకులు ఏ భాష అని లేదు సినిమాలో మంచి కంటెంట్ ఉంటే.. ఆదరిస్తారు అని ఈ సినిమాలు రిలీజ్ చేశాయి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వరుణ్ తేజ్ తన తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక, వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం డైరెక్టర్ ప్ర‌వీణ్‌స‌త్తారుతో ఓ సినిమాను చేయ‌బోతున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Read MOre: Ranbir Kapoor: టాలీవుడ్ హీరోల‌పై రణ్‌బీర్‌ కపూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఫేవ‌రెట్ హీరో ఎవ‌రంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!