హీరోయిన్‌ కృతిసనన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ఆదిపురుష్‌లో సీతగా కృతి

Updated on Jul 27, 2022 09:01 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమాలో సీతగా కృతిసనన్ నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమాలో సీతగా కృతిసనన్ నటిస్తున్నారు.

కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ప్రభాస్ (Prabhas). తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు. సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను మినహాయిస్తే వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఆసక్తి చూపించరు ప్రభాస్. అయితే ప్రభాస్ ఇటీవల పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమవుతోంది.

ఈ రోజు హీరోయిన్ కృతిసనన్ పుట్టినరోజు. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌కు కృతిసనన్‌ ఫోటోను కూడా ట్యాగ్ చేశారు. ఆ పోస్ట్‌కు ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు ప్రభాస్. నీ మ్యాజిక్‌ను ప్రపంచం మొత్తం చేసే వరకు వేచి ఉండలేను అని కామెంట్ పెట్టారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమాలో సీతగా కృతిసనన్ నటిస్తున్నారు.

ఎప్పుడూ నవ్వుతుండాలంటూ..

‘పుట్టినరోజు శుభాకాంక్షలు కృతిసనన్. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆదిపురుష్ సినిమాలో మీ మ్యాజిక్‌ను ప్రపంచం మొత్తం చూసే వరకు వేచి ఉండలేను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ప్రభాస్‌ (Prabhas) వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన సలార్‌, ప్రాజెక్ట్‌ కె సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్‌ షూటింగ్‌ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన కృతిసనన్‌ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. మైథలాజికల్‌ సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడుగా ప్రభాస్ (Prabhas)..సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా.. రావణుడి క్యారెక్టర్‌‌ను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించారు.

Read More : ‘ప్రాజెక్ట్‌ K’ సినిమా సెట్‌ నుంచి లంబోర్గిని కారులో దూసుకెళ్లిన ప్రభాస్‌ (Prabhas).. వీడియో వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!