Adipurush:'ఆదిపురుష్' అప్‌డేట్స్ రిలీజ్ చేసిన‌ ద‌ర్శ‌కుడు.. అయోధ్య‌లో రాముడిగా క‌నిపించ‌నున్న ప్ర‌భాస్ (Prabhas)!

Updated on Sep 27, 2022 12:57 PM IST
Adipurush: ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.
Adipurush: ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న సోష‌ల్ మీడియా ద్వారా 'ఆదిపురుష్' ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఓం రౌత్ ట్వీట్‌తో ప్ర‌భాస్ ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఆదిపురుష్ ప్ర‌మోష‌న్లు షురూ

శ్రీరాముడు దసరా రోజున దశకంఠుడైన రావణుడిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ప్ర‌తీ ఏటా ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంటాయి. రామ్‌లీలా మైదానంలో కొన్ని లక్షలమంది చూస్తుండగా.. రావ‌ణ సంహార కార్యక్రమాన్ని జరుపుతుంటారు. ఈ ఉత్స‌వాల‌ను ల‌వ్‌కుశ రామ్‌లీలా క‌మిటీ నిర్వ‌హిస్తుంటుంది.

'ఆదిపురుష్' 3డీలో

ఢిల్లీలోని రామ్‌లీలా క‌మిటీ ఈ సంవత్సరం విజ‌య ద‌శ‌మి ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా సినీ నటుడు ప్ర‌భాస్ (Prabhas)ను ఆహ్వానించింది. 'ఆదిపురుష్‌' చిత్రంలో రాముడిగా న‌టించిన ప్ర‌భాస్‌తో ఈసారి రావ‌ణ సంహారం చేయించ‌డానికి కమిటీ సంకల్పించింది.

ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా 'ఆదిపురుష్' సినిమా ప్ర‌మోష‌న్ల‌ను షురూ చేశారు. అందులో భాగంగా అక్టోబ‌ర్ 2న ఆదిపురుష్ సినిమా నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. అంతేకాకుండా ఈ సినిమా టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ట్వీట్ చేశారు. 

 

Adipurush: ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న‌ 'ఆదిపురుష్' విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

'బాహుబలి' కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

Read More: Adipurush: 'ఆదిపురుష్' టీజ‌ర్ రిలీజ్ ఫిక్స్!.. ద‌స‌రా రోజున రావ‌ణ ద‌హ‌నం చేయ‌నున్న ప్ర‌భాస్ (Prabhas)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!