Adipurush: 'ఆదిపురుష్' టీజ‌ర్ నిజంగానే ఆల‌స్యం కానుందా ! ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఏంటి !

Updated on Sep 17, 2022 12:32 PM IST
Adipurush:  'ఆదిపురుష్' సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విడుద‌ల‌పై మేక‌ర్స్ వెన‌క్కు త‌గ్గారా?. కార‌ణం ఏంటి?.
Adipurush:  'ఆదిపురుష్' సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విడుద‌ల‌పై మేక‌ర్స్ వెన‌క్కు త‌గ్గారా?. కార‌ణం ఏంటి?.

Adipurush: పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ (Prabhas) కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాను పాన్ వ‌ర‌ల్ట్ స్థాయిలో బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు తొలుత వినిపించాయి. ఈ విషయమై సోష‌ల్ మీడియాలో కూడా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే 'ఆదిపురుష్' అప్‌డేట్స్ ఆల‌స్యం అయ్యే అవకాశం ఉందట. నిజంగానే 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విడుద‌ల‌పై మేక‌ర్స్ వెన‌క్కు త‌గ్గారా? కార‌ణం ఏంటి?.

ద‌స‌రాకు టీజ‌ర్ రిలీజ్!

శ్రీరాముడు దసరా రోజున దశకంఠుడైన రావణుడిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ప్ర‌తీ ఏటా ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంటాయి. రామ్‌లీలా మైదానంలో కొన్ని లక్షలమంది చూస్తుండగా.. రావ‌ణ సంహార కార్యక్రమాన్ని జరుపుతుంటారు . ఈ ఉత్స‌వాల‌ను ల‌వ్‌కుశ రామ్‌లీలా క‌మిటీ నిర్వ‌హిస్తుంటుంది.

ఢిల్లీలోని రామ్‌లీలా క‌మిటీ ఈ సంవత్సరం విజ‌య ద‌శ‌మి ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా సినీ నటుడు ప్ర‌భాస్ (Prabhas) ను ఆహ్వానించింది. 'ఆదిపురుష్‌' చిత్రంలో రాముడిగా న‌టించిన ప్ర‌భాస్‌తో, ఈసారి రావ‌ణ సంహారం చేయించ‌డానికి కమిటీ సంకల్పించిందట‌. ఇదే క్రమంలో అక్టోబ‌ర్ 3 తేదీన ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాస్ రాక‌పోవ‌చ్చనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Adipurush:  'ఆదిపురుష్' సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విడుద‌ల‌పై మేక‌ర్స్ వెన‌క్కు త‌గ్గారా?. కార‌ణం ఏంటి?.

'ఆదిపురుష్' కోసం ఎదురుచూపులు

క‌ట్ చేస్తే ప్ర‌భాస్ (Prabhas) పెద్ద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే స్వర్గస్థులయ్యారు. కృష్ణంరాజు మ‌ర‌ణంతో ప్ర‌భాస్ ఓ నెల పాటు అన్ని షూటింగ్‌ల‌ను క్యాన్సిల్ చేశారట. నిజానికి 'ఆదిపురుష్' టీజ‌ర్ కోసం ప్ర‌భాస్ ఓ షూట్‌లో పాల్గొనాల్సి ఉంద‌ట‌. అయితే ఆ షూట్ పూర్తి కాక‌పోవ‌డంతో టీజ‌ర్ రిలీజ్ వాయిదా వేస్తార‌నే వార్త‌లు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప్ర‌భాస్ న‌టించిన 'ఆదిపురుష్' అప్‌డేట్స్‌ కోసం ప్ర‌భాస్‌ అభిమానులు ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. అలాగే 'ఆదిపురుష్' టీజ‌ర్ రిలీజ్ ద‌స‌రాకు చేస్తారా లేదా? అనే గంద‌ర‌గోళంలో కూడా అభిమానులు ఉన్నారు. ఈ సినిమాపై వ‌స్తున్న‌ రూమ‌ర్ల‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read More: Adipurush: 'ఆదిపురుష్‌'పైనే ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల ఆశ‌లు!.. 'బాహుబ‌లి' రేంజ్‌లో హిట్ ద‌క్కేనా?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!