ప్రభాస్ (Prabhas) సలార్ రిలీజ్ అయ్యేది అప్పుడేనంట.. డేట్ ప్రకటించిన మేకర్స్.. ఆనందంలో ఫ్యాన్స్‌!

Updated on Aug 15, 2022 04:34 PM IST
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సలార్ సినిమా రిలీజ్ డేట్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రకటించారు మేకర్స్
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సలార్ సినిమా రిలీజ్ డేట్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రకటించారు మేకర్స్

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ప్రభాస్ (Prabhas). ఆ తర్వాత ఛత్రపతి, మిస్టర్ పర్‌‌ఫెక్ట్, డార్లింగ్, మిర్చి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఇక అప్పటి నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

ఇక, సలార్ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రకటన కోసం ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది సలార్ చిత్ర యూనిట్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. 

ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సలార్ సినిమా రిలీజ్ డేట్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ప్రకటించారు మేకర్స్

స్పెషల్ పోస్టర్ రిలీజ్..

ఈ మేరకు సలార్ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్‌  పోస్టర్‌ షేర్‌ చేసింది. టీమ్ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సలార్ ఆగమనం‌’ అనే ట్యాగ్‌ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. ‘అన్న వస్తున్నాడు’ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.

‘రాధేశ్యామ్‌’ తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సలార్ సినిమా తెరకెక్కుతోంది, ఈ సినిమాలో ప్రభాస్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సలార్‌‌ సినిమాను  హోంబలే ఫిల్మ్స్‌ సంస్ధ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Read More : Adipurush : ఆమిర్ ఖాన్ కోసం ప్ర‌భాస్ (Prabhas) అంత త్యాగం చేశారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!