ప్రభాస్‌ (Prabhas)పై బాలీవుడ్‌ భామ కృతిసనన్‌ (Kriti Sanon) షాకింగ్ కామెంట్స్‌.. కళ్లలో ఆకర్షణ ఉందన్న హీరోయిన్

Updated on Aug 06, 2022 02:20 PM IST
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతిసనన్ (Kriti Sanon) సీతగా నటిస్తున్నారు
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతిసనన్ (Kriti Sanon) సీతగా నటిస్తున్నారు

రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ప్రభాస్ (Prabhas). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. అప్పటి నుంచి ఆయన అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ అయినా, తోటినటీనటులతో మంచి రిలేషన్‌ మెయింటెయిన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారాయన.

కెరీర్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలే గడుస్తున్నా, ప్రభాస్‌పై తోటి నటులు కంప్లైంట్ చేసిన సందర్భాలు లేనే లేదు. అంతేకాదు.. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ హీరోయిన్ల వరకు అందరూ ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు.

ఈ క్రమంలో పలువురు హీరోయిన్లు ప్రభాస్ మంచితనాన్ని పబ్లిక్‌గా కొనియాడుతున్నారు. మీడియా ముందుకు కూడా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే ఆయనతో 'ఆదిపురుష్' సినిమాలో నటించిన హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon) రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతిసనన్ (Kriti Sanon) సీతగా నటిస్తున్న 'ఆది పురుష్' సినిమా పోస్టర్

భావాలు అర్ధం చేసుకుంటే చాలు..

‘కెరీర్‌లో ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశా. కానీ ప్రభాస్‌ లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదు’ అని చెప్పారు హీరోయిన్ కృతిసనన్‌. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఆదిపురుష్‌’ సినిమాలో నటించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న 'ఆదిపురుష్‌' సినిమాలో కృతిసనన్‌ సీత క్యారెక్టర్‌‌ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో కృతి సనన్ మాట్లాడారు.

ప్రభాస్‌తో మరో సినిమా చేసే చాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు కృతి. ‘ప్రభాస్‌ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తోటి నటీనటుల నుంచి లైట్‌బాయ్‌ వరకు ప్రతి ఒక్కరితో ఆయన వినమ్రంగా ఉంటారు.

ముఖ్యంగా ఆయన కళ్లలో ఏదో తెలియని స్వచ్ఛత, ఆకర్షణ కనిపిస్తాయి. ఆ కళ్లలోని భావాల్ని అర్థం చేసుకుంటే చాలు ఆయన హృదయం యొక్క సున్నితత్వం తెలుస్తుంది. ‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడి క్యారెక్టర్‌‌కు ప్రభాస్‌ (Prabhas) పూర్తిగా న్యాయం చేస్తున్నారు’ అని చెప్పారు కృతి. ప్రస్తుతం కృతిసనన్‌ (Kriti Sanon) బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

Read More : ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా అవెంజర్స్‌ రేంజ్‌లో ఉంటుంది: నిర్మాత అశ్వనీదత్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!