స‌లార్ (Salaar) అప్‌డేట్స్ వ‌చ్చేస్తున్నాయ‌హో.. ప్ర‌భాస్ (Prabhas) కొత్త లుక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Updated on Aug 13, 2022 05:27 PM IST
ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న 'స‌లార్' చిత్రాన్ని 2023లో తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. 
ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న 'స‌లార్' చిత్రాన్ని 2023లో తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. 

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న 'స‌లార్' సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి పలు కొత్త విశేషాల‌తో మేక‌ర్స్ మ‌రో రెండు రోజుల్లో ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. కేజీఎఫ్ ప్రథమ, ద్వితీయ భాగాలతో ఇండియ‌న్ సినిమా రికార్డులను కొల్ల‌గొట్టిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌ నీల్,  హీరో ప్ర‌భాస్‌తో 'స‌లార్' సినిమాను ఒక కొత్త తరహా సబ్జెక్టుతో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌భాస్ నటిస్తున్న 'స‌లార్' అప్‌డేట్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌డంపై అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల్లో స‌లార్ ప్ర‌క‌ట‌న‌

'స‌లార్' కొత్త అప్‌డేట్‌ను ఆగ‌స్టు 15 మ‌ధ్యాహ్నం 12.58 నిమిషాల‌కు ప్ర‌క‌టిస్తామని మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమాను నిర్మిస్తున్న హోంబ‌లే ఫిలిమ్స్ సోష‌ల్ మీడియాలో ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది. 'స‌లార్' సినిమాలో ప్ర‌భాస్ డ‌బుల్ రోల్‌లో కనువిందు చేయనున్నారని టాక్. తండ్రి, కొడుకులుగా ప్ర‌భాస్ వెండితెర‌పై వినోదం పంచ‌నున్నార‌ని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ప్ర‌భాస్‌ను ఈ సినిమాలో కొత్త లుక్‌లో చూపించేందుకు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేయడం విశేషం.


 

స‌లార్ విశేషాలు

కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌లార్' సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ డ‌బుల్ రోల్‌లో న‌టించ‌నున్నారు. ప్ర‌భాస్‌ (Prabhas)కు జోడిగా శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. కేజీఎఫ్ హీరో య‌శ్ కూడా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. అలాగే జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరిరావు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ‌ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో 'స‌లార్' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 'స‌లార్' చిత్రాన్ని 2023లో తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. 

Read More: ప్ర‌భాస్ (Prabhas) సినిమా స‌లార్ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్.. ఏంటంటే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!