ప్రభాస్ (Prabhas), దళపతి విజయ్‌ సినిమాలతో పోటీకి సై అంటున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)!

Updated on Sep 14, 2022 06:41 PM IST
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్, విజయ్‌ వారసుడు సినిమాలతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా154 కూడా సంక్రాంతికి రిలీజ్‌ కానున్నట్టు టాక్
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్, విజయ్‌ వారసుడు సినిమాలతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా154 కూడా సంక్రాంతికి రిలీజ్‌ కానున్నట్టు టాక్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. 'ఆచార్య' ఫలితం నిరాశపరచడంతో తాను నటిస్తున్న సినిమాలపై మరింత శ్రద్ధ పెడుతున్నారు చిరు. ఇప్పటికే 'గాడ్‌ఫాదర్' సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. మలయాళంలో సూపర్‌‌హిట్‌ అయిన 'లూసిఫర్‌‌' సినిమాకు రీమేక్‌గా 'గాడ్‌ఫాదర్' సినిమా తెరకెక్కింది.

ప్రస్తుతం చిరు నాలుగు సినిమాలను వరుసలో పెట్టారు. అందులో బాబి డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్, విజయ్‌ వారసుడు సినిమాలతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా154 కూడా సంక్రాంతికి రిలీజ్‌ కానున్నట్టు టాక్

గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్‌..

మెగాస్టార్ నటిస్తున్న 154వ సినిమా కావడంతో... ఈ సినిమాను మెగా154 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్. జనవరి 13వ తేదీన 'మెగా154' సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

కాగా, ఇప్పటికే సంక్రాంతి బరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’, దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ (తమిళంలో వారిసు) ఉన్నాయి. ఈ రెండు సినిమాలతోపాటు ఇప్పుడు మెగాస్టార్‌‌ సినిమా కూడా పోటీలో నిలబడనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

'మెగా154' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ర‌వితేజ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మిస్తున్న 'మెగా154' సినిమాలో విక్టరీ వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌ చేయనున్నారని టాక్.

Read More : ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్‌పై సూచనలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఖైదీ గెటప్‌ కలిసొచ్చేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!