'దసరా' (Dasara) సినిమా నుంచి కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఫస్ట్ లుక్.. డీ గ్లామర్ లుక్ లో అదిరిపోయిందిగా..!

Updated on Oct 17, 2022 01:48 PM IST
కీర్తి సురేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'దసరా' (Dasara) సినిమా నుంచి కీర్తి ఫ‌స్ట్ లుక్‌ని (Keerthy Suresh) విడుద‌ల చేసింది చిత్ర బృందం.
కీర్తి సురేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'దసరా' (Dasara) సినిమా నుంచి కీర్తి ఫ‌స్ట్ లుక్‌ని (Keerthy Suresh) విడుద‌ల చేసింది చిత్ర బృందం.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది హీరోయిన్ కీర్తి సురేష్‌ (Keerthy Suresh). ఈ అమ్మడు ఇప్పటివరకు డీసెంట్ గా క‌నిపిస్తూ.. ప‌ద్ధ‌తైన పాత్ర‌లే చేసింది. వెండి తెర‌పై మ‌రీ గ్లామ‌ర్ ఒల‌క‌బోయ‌క‌పోయినా.. అందంగా క‌నిపించే పాత్ర‌లే సెలెక్ట్ చేసుకుంటూ వస్తోంది. అయితే, త‌న కెరీర్‌లో తొలిసారిగా ఓ డీ గ్లామ‌ర్ పాత్ర ఎంచుకొంది. 

మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). నాచుర‌ల్ స్టార్ నాని (Nani) హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. అయితే, ఇప్ప‌టికే మేక‌ర్స్ ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది వేసవి కానుకగా మార్చి 30న విడుద‌ల (Dasara Release date) చేస్తామ‌ని ప్ర‌క‌టించేశారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా 'దసరా' (Dasara Movie) సినిమా నుంచి కీర్తి ఫ‌స్ట్ లుక్‌ని (Keerthy Suresh FirstLook) విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో వెన్నెల‌గా క‌నిపించ‌బోతోంది కీర్తి. అయితే, పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే అందులో కీర్తి సురేష్ పెళ్లి దుస్తుల్లో బరాత్‌లో న‌వ్వుతూ చిందులేస్తోంది. 

తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో కీర్తిని చూస్తుంటే.. 'రంగ‌స్థ‌లం'లో స‌మంత చేసిన పాత్ర గుర్తుకొస్తోంది. అది కూడా డీ గ్లామ‌ర్ పాత్రే కావడం విశేషం. క‌థ‌లో భాగ‌మైన ఆ పాత్ర 'రంగ‌స్థ‌లం' సినిమాకే వ‌న్నె తెచ్చింది. ఈ నేపథ్యంలో 'ద‌స‌రా' సినిమాలో కీర్తి కూడా ఆ ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కాగా, ఈ చిత్రంలో స‌ముద్ర ఖ‌ని, సాయి కుమార్‌, జ‌రీనా వ‌హాబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘దసరా’ (Dasara) మూవీ షూటింగ్ 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లవుతోంది. క‌బాలి, కాలా చిత్రాల ఫేమ్ సంతోష్ నారాయ‌ణ్ (Santosh Narayan) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Read More: 'ద‌స‌రా' (Dasara) సినిమాలోని 'ధూమ్ ధామ్ దోస్తాన్..' పాటకు కీర్తి సురేష్ (Keerthy Suresh) మాస్ స్టెప్పులు..!

Advertisement
Credits: Twitter, Pinkvilla

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!