Dasara: 'ద‌స‌రా' సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. తృటిలో త‌ప్పించుకున్న‌ హీరో నాని (Nani)

Updated on Aug 07, 2022 05:11 PM IST
నాని (Nani) న‌టిస్తున్న ద‌స‌రా షూటింగ్ గోదావ‌రి ఖ‌ని కోల్ మైన్స్‌లో జ‌రుగుతోంది. షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింద‌ని టాక్.
నాని (Nani) న‌టిస్తున్న ద‌స‌రా షూటింగ్ గోదావ‌రి ఖ‌ని కోల్ మైన్స్‌లో జ‌రుగుతోంది. షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింద‌ని టాక్.

Dasara: టాలీవుడ్ హీరో నాని (Nani) న‌టిస్తున్న 'ద‌స‌రా' సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం నుంచి నాని తృటిలో త‌ప్పించుకున్నారు. 'ద‌స‌రా' షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. నానికి జ‌రిగిన ప్ర‌మాదంపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. 

నానికి త‌ప్పిన ప్ర‌మాదం

ప్ర‌స్తుతం నాని (Nani) కొత్త సినిమా 'ద‌స‌రా' షూటింగ్ గోదావ‌రి ఖ‌ని కోల్ మైన్స్‌లో జ‌రుగుతోంది. తెలంగాణ సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం విలేజ్సెట్ వేశారు. ఆ సెట్‌లో షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు.. బొగ్గు లోడుతో ఉన్న లారీ కింద నాని ఉన్నార‌ట‌. ఆ లారీలో ఉన్న బొగ్గు అన్‌లోడ్ చేస్తున్న‌ప్పుడు నాని అక్క‌డే ఉన్నారు. ప్ర‌మాదాన్ని ముందే గ‌మ‌నించిన నాని అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నారు. దీంతో పెను ప్ర‌మాదం నుంచి నాని తృటిలో బ‌య‌ట‌ప‌డ్డారు. నాని ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోవ‌డంతో అక్క‌డ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నానికి జ‌రిగిన ప్ర‌మాదం గురించిన వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. 

నాని (Nani) న‌టిస్తున్న ద‌స‌రా షూటింగ్ గోదావ‌రి ఖ‌ని కోల్ మైన్స్‌లో జ‌రుగుతోంది. షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింద‌ని టాక్.

డిసెంబ‌ర్‌లో ద‌స‌రా విడుద‌ల‌!

ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ద‌స‌రా' సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో నాని (Nani) డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. మాస్ యాక్ష‌న్ సీన్ల‌లో నాని అద‌ర‌గొట్ట‌నున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు సముద్రఖని కీలక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 

తెలంగాణ‌ గ్రామీణ నేప‌థ్యంలో 'ద‌స‌రా' సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ్, స‌త్య‌న్ సూర్య‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. 'ద‌స‌రా' చిత్రాన్ని ఈ డిసెంబ‌ర్‌కు విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

Read More: Dasara: ‘ద‌సరా’ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్‌.. నా దోస్తానాలు అంటున్న నాని (Nani)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!