'దసరా' (Dasara Movie) నుంచి అదిరిపోయే అప్ డేట్.. నాని (Hero Nani) ఊర మాస్ లుక్ మామూలుగా లేదుగా..!

Updated on Oct 06, 2022 11:57 PM IST
నాని (Hero Nani) నటించిన 'దసరా' (Dasara Movie) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి.
నాని (Hero Nani) నటించిన 'దసరా' (Dasara Movie) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి.

సినిమా ఫ‌లితంతో సంబంధంలేకుండా ప్రేక్షకుల‌ను కొత్త క‌థ‌ల‌తో అలరించే అతికొద్ది మంది న‌టుల‌లో నాచురల్ స్టార్ నాని (Hero Nani) ఒక‌రు. ప్రస్తుతం ఈ హీరో తన తర్వాతి సినిమా ‘దసరా’పైనే (Dasara Movie) ఫుల్ ఫోకస్ పెట్టేశాడని తెలుస్తోంది. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మహానటి’ కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

'దసరా' (Dasara Movie) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి. తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'దసరా' చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ పాటను అక్టోబర్‌ ౩న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

ఇక, ఈ పోస్టర్‌లో నాని ఊరమాస్‌ (Nani Mass Look) అవతారంలో కనిపిస్తున్నాడు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని (Hero Nani) తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఓ పల్లెటూరి పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

కాగా, 'దసరా' (Dasara Movie) సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయ‌ణ్, సత్యన్ సూర్యన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్‌ కూడా తగ్గించుకున్నాడని సమాచారం. ఇక, ఇప్పటికే ఈ సినిమా నాన్‌-థియేట్రికల్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమచారం.

Read More: Hit 3: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన నాని (Nani)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!