Nani : నాని నటిస్తున్న 'దసరా ' సినిమా మీద పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు !

Updated on Jul 01, 2022 04:56 PM IST
నాని (Nani), కీర్తి సురేశ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో 'దసరా' (Dasara) పై ప్రేక్షకులకు అంచనాలు బాగానే ఉన్నాయి. .
నాని (Nani), కీర్తి సురేశ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో 'దసరా' (Dasara) పై ప్రేక్షకులకు అంచనాలు బాగానే ఉన్నాయి. .

నాని (Nani) కథానాయకుడిగా 'దసరా' (Dasara) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి, శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. ఈ చిత్రంలో నాని, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్నారు. వీరి కాంబినేషనులో గతంలో వచ్చిన 'నేను లోకల్' సినిమా నాని కెరీర్‌గా బాగా హెల్ప్ అయిందన్న మాట నిజమే. 

అయితే ఈ చిత్రం తర్వాత  మళ్ళీ నాని (Nani), కీర్తి సురేశ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో 'దసరా' (Dasara) పై ప్రేక్షకులకు అంచనాలు బాగానే ఉన్నాయి. తెలంగాణ యాసలో మాట్లాడే మాస్ కుర్రాడి గెటప్‌లో ఈ చిత్రంలో నాని కనిపించనున్నాడు.

నాని (Nani) ఇప్పటి వరకు పూర్తి స్థాయి మాస్ పాత్రలు చేయలేదు. అందుకే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండీ, ఆయన అభిమానులలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా షూటింగ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందని పలు వార్తలు వచ్చాయి. 

ఈ క్రమంలో సినిమా దర్శకుడు శ్రీకాంత్ స్పందించారు. అటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు. 'దసరా' (Dasara) సినిమా షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు. పుకార్లను నమ్మవద్దని కోరారు.

'దసరా' సినిమాలో సముద్రఖని, సాయికుమార్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో నాని (Nani) ధరణి అనే పాత్రను పోషిస్తున్నారు. కార్మిక హక్కుల కోసం పోరాడే నాయకుడిలా ఆయన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు.

Read More: 'అంటే.. సుంద‌రానికి' ప్రీ రిలీజ్‌ వేడుకలో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఊహించని ట్రీట్ !

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!