Dasara: ‘ద‌సరా’ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్‌.. నా దోస్తానాలు అంటున్న నాని (Nani)

Updated on Aug 07, 2022 03:21 PM IST
అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న 'ద‌స‌రా' చిత్రంలో నాని (Nani)కి జోడిగా హీరోయిన్‌ కీర్తి సురేష్ న‌టిస్తున్నారు.
అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న 'ద‌స‌రా' చిత్రంలో నాని (Nani)కి జోడిగా హీరోయిన్‌ కీర్తి సురేష్ న‌టిస్తున్నారు.

Dasara: టాలీవుడ్ హీరో నాని (Nani) న‌టిస్తున్న చిత్రం 'ద‌స‌రా' నుంచి మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 'ద‌స‌రా' సినిమాలో నాని త‌న స్నేహితుల‌తో క‌లిసి ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌న ట్విట్ట‌ర్‌లో నాని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ కూడా చేశారు. 

మాస్ యాక్ష‌న్ మూవీగా ద‌స‌రా

'ఎమ్‌సీఏ' త‌రువాత నాని (Nani) కెరీయ‌ర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ అయిన సినిమాలు హిట్ కాలేదు. 'అంటే సుంద‌రానికీ' హిట్ ఇస్తుంద‌నుకుంటే.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. ప్ర‌స్తుతం నాని 'ద‌స‌రా' సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ అందుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. 'ద‌స‌రా' చిత్రాన్ని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదేలా తెర‌కెక్కిస్తున్నారు. 

 

నాని కొత్త పోస్టర్ రిలీజ్

'ద‌స‌రా' సినిమా నుంచి ఇటీవల విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని పెంచాయి. ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 'ద‌స‌రా' సినిమా కొత్త పోస్ట‌ర్‌లో నాని ఓ గూడ్స్ రైలులో త‌న స్నేహితుల‌తో క‌లిసి ఉన్నారు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్‌.. ఇర‌గ మ‌ర‌గ చేద్దాం’ అంటూ ఆ పోస్ట‌ర్‌కు క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. 

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న 'ద‌స‌రా' చిత్రంలో నాని (Nani)కి జోడిగా హీరోయిన్‌ కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. తెలంగాణ‌ గ్రామీణ నేప‌థ్యంలో 'ద‌స‌రా' సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ్, స‌త్య‌న్ సూర్య‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. 'ద‌స‌రా' చిత్రాన్ని ఈ డిసెంబ‌ర్‌కు విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

Read More: Dasara: నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'ద‌స‌రా'కు అంత డిమాండా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!