Dasara: సిల్క్ స్మిత పోస్ట‌ర్‌తో 'ద‌స‌రా' రిలీజ్ తేదీ విడుద‌ల!.. ఊరమాస్ లుక్‌లో నాని (Nani)

Updated on Aug 26, 2022 05:41 PM IST
Dasara: సింగ‌రేణి గ‌నుల నేప‌థ్యంలో 'ద‌స‌రా' (Nani) చిత్రం  తెర‌కెక్కుతోంది.  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 2023 మార్చి 30న రిలీజ్ కానుంది.
Dasara: సింగ‌రేణి గ‌నుల నేప‌థ్యంలో 'ద‌స‌రా' (Nani) చిత్రం  తెర‌కెక్కుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 2023 మార్చి 30న రిలీజ్ కానుంది.

Dasara: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) న‌టిస్తున్న చిత్రం 'ద‌స‌రా'. ఈ రోజే ఈ సినిమా విడుదల తేదిని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాకి ముందు రిలీజైన 'అంటే సుంద‌రానికీ..' చిత్రం నానికి అనుకున్నంత స‌క్సెస్ ఇవ్వ‌లేదు. 'ద‌స‌రా'లో నాని క్యారెక్టర్ కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా ద‌స‌రా పండుగ కానుక‌గా విడుదల అవుతుందని అంద‌రూ అనుకున్నారు. కానీ ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది. 

సిల్క్ స్మిత పోస్ట‌ర్

సింగ‌రేణి కార్మిక జీవితాల నేప‌థ్యంలో 'ద‌స‌రా' (Nani) చిత్రం  తెర‌కెక్కుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 2023 మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ రోజే మేక‌ర్స్ ఈ సినిమా కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. నానితో పాటు హాట్‌ బ్యూటీ సిల్క్ స్మిత చిత్రం కూడా పోస్టరులో క‌నిపించింది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  

పాన్ ఇండియా సినిమాలో నాని

Dasara: నాని (Nani) న‌టిస్తున్న మొద‌టి పాన్ ఇండియా సినిమా 'ద‌స‌రా'. ఈ సినిమా షూటింగ్ గోదావరి మైన్స్‌లో జ‌రుగుతోంది. ఊరమాస్ లుక్‌లో నాని 'ద‌స‌రా' సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఇదివరకు ఎప్పుడూ చేయని, ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిగా కల్లా చిత్రీకరణ పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 

Read More: Dasara: ‘ద‌సరా’ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ రిలీజ్‌.. నా దోస్తానాలు అంటున్న నాని (Nani)

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!