రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల బిజినెస్!.. నాని ‘దసరా’ (Dasara) చిత్రానికి భారీ డిమాండ్

Updated on Oct 08, 2022 11:56 AM IST
నాని (Nani) నటిస్తున్న ‘దసరా’ (Dasara) చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది
నాని (Nani) నటిస్తున్న ‘దసరా’ (Dasara) చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఆయన ఇప్పుడు ‘దసరా’ (Dasara) అనే చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘దసరా’ను శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. 

ఇప్పటికే విడుదలైన ‘దసరా’ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దసరా పండుగ కానుకగా రిలీజైన ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ సాంగ్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

‘దసరా’ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలసి ‘నేను లోకల్’ అనే సినిమాలో జోడీగా అలరించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ‘దసరా’ పైనా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మాతగా నిర్మిస్తున్నారు. 

ఇకపోతే ‘దసరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు రూ. 100 కోట్ల బిజినెస్ జరిగిందట. నాని లాంటి మిడ్ రేంజ్ హీరో నటించిన సినిమా.. అందులోనూ ఓ కొత్త దర్శకుడు తీసిన చిత్రానికి ఇంత బిజినెస్ జరగడం ఏంటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘దసరా’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఏకంగా రూ. 30 కోట్లను అమెజాన్ సంస్థ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇతర భాషలకు చెందిన రైట్స్‌కు మరో రూ. 10 కోట్లు.. శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ. 20 కోట్లు వచ్చాయని సమాచారం. 

నాని చిత్రాల్లో ఇదే హయ్యెస్ట్

మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ‘దసరా’ చిత్రానికి రూ. 60 కోట్లు వచ్చాయని సమాచారం. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు రూ. 20  కోట్లు.. 'అంటే సుందరానికి' సినిమాకు రూ. 30 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాక్సాఫీసు వద్ద ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఫర్వాలేదనిపించగా.. ‘అంటే సుందరానికి’ అంతగా ఆడలేదు. ‘దసరా’పై ఈ చిత్రాల రిజల్ట్ ఎఫెక్ట్ పడుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. 'దసరా'కు రూ. 40 కోట్ల రేంజ్‌లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అంటే మొత్తం కలుపుకొని రూ. 100 కోట్లన్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే నాని కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలుస్తుంది. మరి ఈ మూవీతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

Read more: Dasara: నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ‘దసరా’ యాక్షన్‌ సినిమా కాదా? పక్కా లవ్‌స్టోరీ అని ఇండస్ట్రీ టాక్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!