Dasara: 'ద‌స‌రా' పండుగ‌కు 'ధూమ్ ధామ్ దోస్తానా' అంటున్న హీరో నాని (Nani)

Updated on Sep 29, 2022 04:46 PM IST
Dasara:  ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేసి మ‌రీ 'ద‌స‌రా' సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు హీరో నాని (Nani).
Dasara: ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేసి మ‌రీ 'ద‌స‌రా' సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు హీరో నాని (Nani).

Dasara: టాలీవుడ్ హీరో నాని (Nani) న‌టిస్తున్న 'ద‌స‌రా' చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల  ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌స‌రా' సినిమా తెర‌కెక్కుతోంది. దసరా పండుగ సందర్భంగా ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేయ‌నున్నారు మేక‌ర్స్.  ఆ విష‌యాన్ని హీరో నానినే స్వ‌యంగా తెలిపారు. ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేసి మ‌రీ 'ద‌స‌రా' సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. మాస్ సాంగ్ రిలీజ్‌తో ఇక జాత‌రే అంటున్నారు నాని అభిమానులు. 

మాస్ సాంగ్ రిలీజ్

'ద‌స‌రా' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌నున్నారు. ధూమ్ ధామ్ దోస్తానా అంటూ సాగే మాస్ పాట‌ను ద‌స‌రా పండుగ అంటే అక్టోబ‌ర్ 5 తేదీన‌ విడుద‌ల చేస్తామ‌ని హీరో నాని  (Nani) తెలిపారు. ఈ పాట‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జ‌రుగుతుంద‌ని స‌మాచారం.

ఈసినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సముద్రఖని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. 'ద‌స‌రా' చిత్రం 2023 మార్చి 30వ తేదీన విడుదల కానుంది. 


 

ప‌క్కా మాస్ సినిమా

 నాని (Nani) న‌టించిన 'అంటే సుంద‌రానికీ' సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌గా ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచింది. 'ద‌స‌రా' మాత్రం ప‌క్కా మాస్ యాక్షన్‌ సినిమాగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాని మాస్ లుక్‌ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో వెండితెర‌పై వినోదం పంచనున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద‌స‌రా చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 

'ద‌స‌రా' నాన్ థియేట్రికల్ రైట్స్ వ‌సూళ్లు అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. ఓటీటీ, హిందీ, శాటిలైట్ అన్నీ కలుపుకొని దాదాపు రూ. 47 కోట్లు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఈ ఆఫ‌ర్‌కు నిర్మాత‌లు కూడా ఓకే చెప్పార‌ట‌. 'ద‌స‌రా' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

Read More: Dasara: సిల్క్ స్మిత పోస్ట‌ర్‌తో 'ద‌స‌రా' రిలీజ్ తేదీ విడుద‌ల!.. ఊరమాస్ లుక్‌లో నాని (Nani)

 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!