యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న 'దసరా' (Dasara) మూవీలోని 'ధూమ్ ధామ్ దోస్తాన్'..!

Updated on Oct 15, 2022 04:12 PM IST
'దసరా' (Dasara) మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
'దసరా' (Dasara) మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'దసరా' (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ పల్లెటూరి యువకుడిగా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఈ సాంగ్ ఇప్పటి వరకు యూట్యూబ్ లో 7.5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 'దసరా' (Dasara) మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమా నుండి "ధూమ్ ధామ్ దోస్తాన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ లో కూడా నాని రా అండ్ రాస్టిక్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. 

ఈ పాటలో హీరో నాని (Hero Nani), అతని బృందంతో కలిసి మాస్ స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ పాడే ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి ఎంతో అద్భుతంగా ఆలపించగా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బ్యూటిఫుల్ ట్యూన్ అందించారు. ఈ సాంగ్ యువత తోపాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటోంది.

ఈ సాంగ్ ఇప్పటి వరకు యూట్యూబ్ లో 7.5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించినట్లు.. అలాగే ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'దసరా' (Dasara) మూవీ వచ్చే ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read More: 'దసరా' (Dasara Movie) నుంచి అదిరిపోయే అప్ డేట్.. నాని (Hero Nani) ఊర మాస్ లుక్ మామూలుగా లేదుగా..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!