'ద‌స‌రా' (Dasara) సినిమాలోని 'ధూమ్ ధామ్ దోస్తాన్..' పాటకు కీర్తి సురేష్ (Keerthy Suresh) మాస్ స్టెప్పులు..!

Updated on Oct 15, 2022 01:50 PM IST
అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి (Keerthy Suresh) ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి (Keerthy Suresh) ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

టాలీవుడ్ నాచుర‌ల్ స్టార్ నాని (Natural Star Nani) న‌టిస్తున్న తాజా చిత్రం 'ద‌స‌రా' (Dasara). ఈ చిత్రానికి  ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ బాణీలు సమకూరుస్తున్నాడు. 2023 మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్, 'మహానటి' కీర్తిసురేష్ (Keerthy Suresh) 'ద‌స‌రా' సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. సింగరేణి నేపథ్యంలోని కూడిన కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి చేతిలో అఫీషియల్‌గా ఈ ఒక్క సినిమానే ఉంది. చిరంజీవి 'భోళా శంక‌ర్' చిత్రంలో చెల్లిగా న‌టిస్తోంది. ఇక త‌మిళ సినిమాలో కూడా న‌టిస్తోంది. అయితే కీర్తి అంచ‌నాలు ఎక్కువ‌గా 'ద‌స‌రా' పైనే ఉన్నాయి. 

అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి (Keerthy Suresh) ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కీర్తి వదులు చొక్కా.. లుంగీ ధరించి, బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని మాస్ డ్యాన్స్ తో నెట్టింట రచ్చ చేసింది. 'దసరా' సినిమాలోని 'ధూమ్ ధామ్ దోస్తాన్..' అనే పాటకు ఫ్రెండ్ తో కలిసి మాస్ స్టెప్పులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ఈ డ్యాన్స్ చూసిన అభిమానులు "అమ్మో కీర్తి సురేష్ (Keerthy Suresh) లో ఈ యాంగిల్ మాస్ డ్యాన్స్ మేం ఎప్పుడూ చూడలేదు.. సూపర్" అంటూ ప్రశంసిస్తున్నారు. బాబోయ్ ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన కీర్తి సురేష్ ఇటీవ‌లి కాలంలో ఇంత ర‌చ్చ చేస్తుందేంట‌ని కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, 'దసరా' (Dasara Movie) సినిమా సింగ‌రేణి ప్రాంతంలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే క‌థాంశం నేప‌థ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగుతోపాటు వివిధ భాష‌ల్లో విడుద‌లవుతున్న ఈ మూవీలో సాయికుమార్, స‌ముద్ర‌ఖ‌ని, జ‌రీనా వ‌హ‌బ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలంగాణ యాస‌లో ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైనర్‌గా తెర‌కెక్కుతున్న ద‌స‌రా చిత్రాన్ని 2023 మార్చి 30న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Read More: యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న 'దసరా' (Dasara) మూవీలోని 'ధూమ్ ధామ్ దోస్తాన్'..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!