సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ మల్టీస్టారర్‌‌లో నటించనున్న నేచురల్ స్టార్ నాని (Nani)! నిజమెంత?

Updated on Jul 16, 2022 07:35 PM IST
దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని (Nani), సూర్య
దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని (Nani), సూర్య

శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ సినిమాల వరుస విజయాలతో జోరు మీదున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కెరీర్‌‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఫుల్‌లెంగ్త్‌ మాస్ క్యారెక్టర్‌‌ చేస్తున్నారు నాని.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లోనూ మల్టీస్టారర్‌‌ సినిమాల హవా నడుస్తోంది. అందులోనే టాలీవుడ్, కోలీవుడ్‌, మాలీవుడ్‌ హీరోలు నటిస్తే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే అటువంటి కాంబినేషన్‌లు సెట్‌ కావడం అరుదు అనే చెప్పాలి. అటువంటి కాంబినేషన్ సెట్‌ అయ్యిందని ఇండస్ట్రీలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కేజీఎఫ్, కేజీఎఫ్‌2 వంటి బంపర్ హిట్‌ సినిమాలను తెరకెక్కించిన హోంబలే సంస్థ ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేసి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్, సూర్య, సుధ కొంగర

భారీ సినిమాలు తెరకెక్కిస్తున్న హోంబలే..

యశ్‌ హీరోగా తెరకెక్కించిన కేజీఎఫ్, కేజీఎఫ్‌2 సినిమాల తర్వాత వరుసగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తోంది హోంబలే సంస్థ. అందులో భాగంగానే ప్రశాంత్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, పలు క్రేజీ కాంబినేషన్స్‌లో సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో సూర్య, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని (Nani) కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్టు టాక్. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.

సూర్య, దుల్కర్ సల్మాన్‌లతో డైరెక్టర్ సుధ కొంగర మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నేచురల్ స్టార్ నాని (Nani) కూడా నటించనున్నట్టు సమాచారం. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారి సమాచారం ఎప్పుడొస్తుందో చూడాలి మరి. 

Read More : చియాన్ విక్రమ్‌తో జోడీ కట్టనున్న కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).. రెమ్యునరేషన్ ఎంతంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!