రవితేజకు (Ravi Teja) చిరంజీవి స్ఫూర్తి .. నాకు రవితేజ స్ఫూర్తి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్లో నాని (Nani)
‘రవితేజ (Ravi Teja) అన్నయ్యకు చిరంజీవి గారు స్ఫూర్తి అయితే, నాకు రవితేజ స్ఫూర్తి. ప్రస్తుతం రవితేజ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. అలాగే రవితేజ సినిమాలో నటించాలని నేను కూడా అనుకుంటున్నా. ‘నేను అనుకున్నది సాధించాను.. నువ్వు ఎందుకు సాధించలేవ్’ అని ధైర్యాన్నిచ్చే రవితేజలాంటి నటులు ప్రతి తరానికీ ఒకరుంటారు’ అని నేచురల్ స్టార్ నాని (Nani) అన్నారు.
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నేచురల్ స్టార్ నాని తన మదిలోని భావాలను అభిమానులతో పంచుకున్నారు.
‘రవితేజ అన్న గురించి మాట్లాడే ఛాన్స్ వస్తుందనే, రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చాను. రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ, సినీ కార్మికులకు ఎంత సాయం చేశారో మాటల్లో చెప్తే అర్థం కాదు. 20 సంవత్సరాల నుంచి ‘రవితేజ ఆన్ డ్యూటీ’.. జూలై 29 నుంచి ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు నాని.
గొప్ప నటుల్లో నాని ఒకరు: రవితేజ
‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాని అంటే నాకు చాలా ఇష్టం. సౌత్‌లో ఉన్న గొప్ప నటుల్లో నాని ఒకరు. వేణుతో కలిసి ‘స్వయంవరం’ సినిమా చేయాలి. అప్పుడు మిస్ అయ్యా. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కుదిరింది. దర్శకుడికి తొలి సినిమాలా అనిపించదు. ఈ టీమ్‌తో మొదటిసారి పనిచేశా. అందరూ ఈ సినిమాకు వందశాతం న్యాయం చేశారు’ అని రవితేజ (Ravi Teja) చెప్పారు.
రీసెట్ చేస్తాడు: బాబీ
‘రవితేజ ఏదైనా సెట్ చేయటమే కాదు.. రీసెట్ కూడా చేస్తారు. సర్దార్ గబ్బర్‌సింగ్ అవకాశం వచ్చినప్పుడు, నా కుటుంబ సభ్యుల కంటే ముందు రవితేజకే (Ravi Teja) చెప్పాను. భుజం తట్టి.. ధైర్యంగా ముందుకెళ్లమని ప్రోత్సహించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోయినా, నాకు ఫోన్ చేసి సినిమా కోసం ఓ కథ అడిగారు. అది ఆయన గొప్పతనం’ అని దర్శకుడు బాబీ అన్నారు.
Read More : విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ సినిమా తెలుగు ట్రైలర్.. అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్