విదేశాల‌కు వెళ్లిన‌ మ‌హేష్ బాబు (Mahesh Babu).. కుమారుడు గౌత‌మ్ కోస‌మేనా!

Updated on Jul 21, 2022 06:21 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న కొడుకు గౌత‌మ్ కోసం విదేశాల‌కు వెళ్లారు. గౌత‌మ్‌ను లండ‌న్‌లోని ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో చేర్పించ‌నున్నారు.
మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న కొడుకు గౌత‌మ్ కోసం విదేశాల‌కు వెళ్లారు. గౌత‌మ్‌ను లండ‌న్‌లోని ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో చేర్పించ‌నున్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కు వెళ్లారు. హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ రోజు ఉద‌యం మహేష్ బాబుతో పాటు అత‌ని భార్య, పిల్ల‌లు మీడియాకు క‌నిపించారు. రీసెంట్‌గా మ‌హేష్ బాబు యూర‌ప్, అమెరికా దేశాల‌కు వెళ్లారు. అమెరికాలో ప్ర‌పంచ కుబేరుడైన బిల్ గేట్స్‌ను క‌లిశారు. ఇక ఇప్పుడు మ‌హేష్ ఎక్క‌డికి వెళ్లారో అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉంది.

గౌత‌మ్ చ‌దువు కోసం లండ‌న్
మ‌హేష్ బాబు  (Mahesh Babu) త‌న కొడుకు గౌత‌మ్ కోసం విదేశాల‌కు వెళ్లారు. గౌత‌మ్‌ను లండ‌న్‌లోని ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో చేర్పించ‌నున్నారు. గౌత‌మ్‌ను కాలేజ్‌లో జాయిన్ చేసేందుకు మ‌హేష్ బాబుతో స‌హా త‌న భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార కూడా వెళ్లారు.

గౌతమ్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేద‌ని మ‌హేష్ బాబు మొద‌టి నుంచి చెబుతున్నారు. గౌత‌మ్‌కు చ‌దువుపైన ఆస‌క్తి ఉంద‌ని ప‌లు ఇంటర్వ్యూలలో తెలిపారు. గౌత‌మ్‌ను కాలేజీలో దిగ‌బెట్టేందుకు మ‌హేష్ బాబు లండ‌న్ వెళ్లారు. కూతురు సితార‌కు మాత్రం న‌ట‌న అంటే ఎంతో ఆస‌క్తి ఉంద‌ట‌. సితార‌కు కూచిపూడి నాట్యం కూడా నేర్పిస్తున్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కు వెళ్లారు.

ఆగ‌స్టు నుంచి మ‌హేష్ షూటింగ్
మ‌హేష్ (Mahesh Babu) లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చాక సినిమా షూటింగ్‌ల‌లో బిజీ కానున్నారు. ఆగస్టు నెలలో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. మ‌హేష్ బాబు పుట్టిన రోజు ఆగ‌స్టు 9. ఈ పుట్టిన రోజుతో మ‌హేష్ బాబు 47వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌నున్నారు. 

 

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌న ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కు వెళ్లారు.

పోకిరీ రీరిలీజ్
మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా పోకిరి సినిమాను కొత్త హంగుల‌తో రీరిలీజ్ చేయ‌నున్నారు. 4K రిజల్యూషన్‌లోకి రీమాస్టర్ చేసి.. డాల్బీ ఆడియో టెక్నాలజీతో విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ థియేట‌ర్ల‌లో పోకిరి సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. 

Read More: కూతురు 'సితార' బ‌ర్త్ డే రోజున మ‌హేష్ బాబు (Mahesh Babu) స్పెష‌ల్ ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!