కాపీ ట్యూన్ కాదు.. ఇది అసలు సిసలైన క‌రెక్ట్ ట్యూన్ : థమన్ (Thaman)

Updated on May 16, 2022 02:53 PM IST
మ‌.. మ‌.. మ‌హేశా సాంగ్ కాపీ ట్యూన్   కాంట్ర‌వ‌ర్సీపై థ‌మ‌న్  (Thaman) ఏమ‌న్నారంటే..
మ‌.. మ‌.. మ‌హేశా సాంగ్ కాపీ ట్యూన్ కాంట్ర‌వ‌ర్సీపై థ‌మ‌న్  (Thaman) ఏమ‌న్నారంటే..

Ma..Ma..Mahesha Song : స‌ర్కారు వారి పాట సినిమాకు థ‌మ‌న్ అందించిన సంగీతం స‌న్సేష‌న‌ల్ అయింది. మ‌హేష్, కీర్తి న‌టించిన ఈ సినిమాలో పాట‌లు హైలెట్‌గా నిలిచాయి. కానీ మ‌.. మ‌.. మ‌హేశా సాంగ్ కాపీ ట్యూన్ అంటూ పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ఆ కాంట్ర‌వ‌ర్సీపై థ‌మ‌న్  (Thaman) ఏమ‌న్నారంటే..

ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్ల మోత మోగిస్తుంది. మే 12న రిలీజ్ అయిన ఈ సినిమాను జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌లు నిర్మించాయి. అనంత శ్రీరామ్ అదిరే లిరిక్స్ అందించారు. స‌ర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా థ‌మ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు హిట్ అయ్యాయి. థ‌మ‌న్ అందించిన సంగీతం కేక అంటూ మెచ్చుకున్నారు. కానీ ఓ వివాదం థ‌మ‌న్ మెడ‌కు చుట్టుకుంది. 

క‌ళావ‌తి, మ‌..మ‌.. మ‌హేశా, స‌ర‌.. స‌ర.. స‌ర్కారు, పెన్నీ పాట‌లు మాస్ హిట్ కొట్టాయి. మ‌.. మ‌.. మ‌షేశా సాంగ్‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాయి. ఇప్పుడు ఆ పాట కాంట్ర‌వ‌ర్సీ అయింది.  స‌రైనోడు సినిమాలో ట్యూన్ కాపీ కొట్టారంటూ థ‌మ‌న్‌పై కాంట్ర‌వ‌ర్సీ క్రీయేట్ చేశారు.

కాంట్ర‌వ‌ర్సీపై థ‌మ‌న్ (Thaman) రియాక్ట్ అయ్యారు. కాపీ ట్యూన్ సంగ‌తి త‌న‌కు తెలియ‌దు అన్నారు. ఒక వేళ అలా కాపీ చేసుంటే త‌న టీమ్ త‌న‌కు చెప్పేవాళ్ల‌ని.. త‌న టీం మొత్తం 14 మంది అని థ‌మ‌న్ చెప్పారు. లిరిసిస్ట్‌, ప్రోగ్రామ‌ర్స్ ఎవ‌రైనా త‌న టీం కాపీ ట్యూన్ ఉంటే చెప్పేసేవాళ్ల‌న్నారు. రిపీటెడ్ యాప్స్ కూడా ఉన్నాయని.. వాటిల్లో సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంద‌న్నారు. మ‌..మ‌.. మ‌హేశా సాంగ్ (Ma..Ma..Mahesha Song)మాకు వ‌చ్చిన ట్యూన్‌లో చేశామ‌ని.. కాపీ ట్యూన్ కాద‌ని క్లారిటీ ఇచ్చారు సంగీతం మాస్టారు థ‌మ‌న్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!