SS Thaman: మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ ఫ్యామిలీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

Updated on May 22, 2022 05:21 PM IST
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ (Music Director SS Thaman)
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ (Music Director SS Thaman)

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే.. అది థ‌మన్ (Thaman) మాత్రమే.  ఈ విషయాన్ని తడుముకోకుండా ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇటీవలే 'సర్కారు వారి పాట' చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న థ‌మన్‌.. ప్రస్తుతం గాడ్‌ ఫాదర్ (Godfather), ఆర్‌సీ-15 (RC15) చిత్రాలకు మ్యూజిక్‌ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు.

స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రస్తుతం థమన్ చేతిలోనే ఉన్నాయి. ఇక అతను చేసిన ప్రతి సినిమా మ్యూజికల్‌గా హిట్ అవుతూనే ఉంది. దీంతో టాలీవుడ్‌లో థ‌మన్‌కి డిమాండ్ బాగా పెరిగింది.  

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో థ‌మ‌న్ (Thaman) తన భార్య, కొడుకు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయ‌న‌ ప్లే బ్యాక్ సింగర్ శ్రీ వర్ధినిని వివాహం చేసుకున్నాడు. శ్రీ వ‌ర్దిని గతంలో మణిశర్మ, యువన్‌ శంకర్‌ రాజా మొదలైన వారి వద్ద ప్లే బ్యాక్ సింగర్‌గా పనిచేసేది. థ‌మన్‌ డైరెక్షన్‌లోనూ ఆమె నాలుగు పాటలు పాడింది. '

'వర్ధిని వాయిస్ బాగుంటుందని డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లకు అనిపిస్తే పాడిస్తారు. భవిష్యత్తులో ఆమెతో కలిసి స్టేజ్‌ షోలు చేయాలని ఉంది. అయితే దానికన్నా ముందు, ఆమె రెండు మూడు సూపర్‌ హిట్ పాటలను పాడాలి' అని థ‌మ‌న్ (Thaman) తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇక తన కొడుకు గురించి చెబుతూ 'నా ట్యూన్‌లను మొదటగా త‌నే విని అభిప్రాయం చెబుతాడు. మ్యూజిక్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడటంలో అతడికీ మంచి పట్టు ఉంది. పియానోలో నాలుగో గ్రేడ్‌ పూర్తి చేశాడు. అతడు ఏ వృత్తి ఎంచుకుంటాడో నాకు తెలియదు.' అని తమన్‌ వెల్లడించాడు. మరి తమన్ తన భార్యతో కలిసి స్టేజి షోలు ఎప్పుడు నిర్వహిస్తాడో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!