డైరెక్టర్ శంకర్‌‌ పోస్టుపై మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ramcharan) కామెంట్లు.. వైరల్‌ అవుతున్న ట్వీట్ !

Updated on Aug 26, 2022 05:51 PM IST
రాంచరణ్ (Ramcharan), డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో ఆర్‌‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది
రాంచరణ్ (Ramcharan), డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో ఆర్‌‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది

స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్​(Ramcharan) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా RC15 వర్కింగ్​ టైటిల్​తో షూటింగ్​ జరుపుకుంటోంది. ఈ చిత్రం పై సౌత్​లో మాత్రమే కాకుండా, నార్త్​లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

శంకర్, కమల్​ హాసన్​ కాంబినేషన్​లో మొదలైన 'ఇండియన్ 2' చిత్రాన్ని పూర్తి చేసేందుకు, ఈ సినిమాకి బ్రేక్​ ఇచ్చారు డైరెక్టర్​ శంకర్​. ఈ విషయాన్ని స్వయంగా శంకర్​ తన సోషల్ మీడియా అకౌంట్​ ద్వారా తెలిపారు.

అయితే తాజాగా ఈ పోస్ట్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. 'RC15' షూటింగ్ సెట్స్‌లో ఆయనను కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక 'ఇండియన్ 2' పునః ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఆ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆ చిత్రబృందానికి  'ఆల్ ది బెస్ట్' కూడా చెప్పారు. రాంచరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.

 

రాంచరణ్ (Ramcharan), డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో ఆర్‌‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది

RC15 షూటింగ్ వాయిదా..

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రాంచరణ్ , సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో కలిసి తన కెరీర్‌లోని 15 వ సినిమా చేస్తున్నారు. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాకు అనుకోని బ్రేక్ పడింది.  దర్శకుడు శంకర్  మరో ప్రాజెక్టును కూడా టేకప్ చేశారు. కమల్ హాసన్​తో చేస్తున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’ కి షిఫ్ట్ అయ్యారు.

అయితే రాంచరణ్​ సినిమాని మధ్యలోనే వదిలేయడంతో, చెర్రీ సినిమా 'ఆగిపోయినట్టేనా' అంటూ కొన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇవ్వడం కోసమే.. శంకర్ డైరెక్ట్​గా సోషల్​మీడియాలో తన అభిప్రాయాలను పోస్ట్​ చేశారు.

మెగా ఫ్యాన్స్​కి క్లారిటీ ఇవ్వడం కోసమే శంకర్​ ఈ పోస్ట్ చేసారని టాక్. అందరూ అనుకున్నట్టుగా రాంచరణ్​ సినిమా షూటింగ్​ వాయిదా పడలేదనీ, రెండు సినిమాలు తాను ఒకేసారి చేయబోతున్నానని ఆయన తెలిపారు. దీంతో ఆయన చాలా మందికి సమాధానం చెప్పడమే కాకుండా.. పలు రూమర్స్​కి కూడా చెక్ పెట్టినట్టు అయ్యింది. అంటే ‘ఇండియన్ ​ 2’తో పాటే,  రాంచరణ్ (Ramcharan)​ సినిమా షూటింగ్​ కూడా జరగనుందని తెలుస్తోంది.

Read More : Father & Son Duo : వెండితెర 'విచిత్రాలు'.. టాలీవుడ్ 'స్క్రీన్' పై కలిసి నటించిన తండ్రీ కొడుకులు వీరే !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!