‘జనగణమన’ తర్వాత సల్మాన్‌ఖాన్ (Salman Khan)తో సినిమా చేయనున్న పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)!

Updated on Aug 22, 2022 06:02 PM IST
బుడ్డా హోగా తేరా బాప్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh).. సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)తో బాలీవుడ్‌ సినిమా చేయనున్నారని టాక్
బుడ్డా హోగా తేరా బాప్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh).. సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)తో బాలీవుడ్‌ సినిమా చేయనున్నారని టాక్

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan)కు చాలా రోజులుగా హిట్‌ లేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్‌‌ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు సల్మాన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ప్రస్తుతం లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు కరణ్‌ జోహార్, చార్మి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా తర్వాత పూరీ – విజయ్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు జనగణమన అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.

బుడ్డా హోగా తేరా బాప్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh).. సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)తో బాలీవుడ్‌ సినిమా చేయనున్నారని టాక్

చిన్న వార్త ఇంట్రెస్టింగ్‌గా..

జనగణమన సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ తెరకెక్కించబోయే సినిమా ఏంటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే జనగణమన సినిమా తర్వాత పూరీ చేయబోయే సినిమాపై ఎటువంటి వార్తలు ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే తాజాగా వచ్చిన ఒక చిన్న వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పూరీ తర్వాత సినిమా బాలీవుడ్‌ మూవీ అని సమాచారం. అది కూడా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా అని తెలుస్తోంది.

సల్మాన్‌ ఖాన్‌, - పూరి జగన్నాథ్‌ మధ్య ఇటీవల చిన్న మీటింగ్‌ జరిగిందని అంటున్నారు. సల్లూ భాయ్‌కి పూరీ జగన్నాథ్‌ ఒకపాయింట్‌ చెప్పారని టాక్. అన్నీ ఓకే అయితే జనగణమన సినిమా తర్వాత సల్మాన్ – పూరీ కాంబినేషన్‌ సినిమా ఉండొచ్చు అని సమాచారం. ప్రస్తుతం 'లైగర్‌' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూరి సల్మాన్ ఖాన్ కోసం స్క్రిప్ట్  ఉందని చెప్పారు. 'వాంటెడ్‌' సినిమా విడుదలైనప్పటి నుంచి సల్మాన్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను అని కూడా అన్నారు పూరీ.

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) హీరోగా నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా పోస్టర్

చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నా..

‘సల్మాన్ ఖాన్‌ అంటే చాలా ఇష్టం. ఏదో రోజు అతనిని డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’ అని కూడా అన్నారు పూరి. ఇక పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) తొలి బాలీవుడ్‌ చిత్రం 'బుడ్డా హోగా తేరా బాప్‌' మంచి విజయాన్ని అందుకుంది. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో పూరీ (Puri Jagannadh) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక సల్మాన్‌ ఖాన్‌ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం 'కబీ ఈద్‌ కబీ దివాళీ' అనే సినిమా చేస్తున్నారు. 'కాటమరాయుడు' సినిమాకిది రీమేక్‌ అని సమాచారం. ఇది కాకుండా 'టైగర్‌ 3' సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాల విజయాలు సల్మాన్‌(Salman Khan) కే కాదు.. మొత్తం బాలీవుడ్‌కి చాలా అవసరం.

Read More : గాడ్‌ఫాదర్‌‌ సినిమా పాట నుంచి చిరంజీవి (Chiranjeevi), సల్మాన్‌ఖాన్​ ఫోటోలు లీక్..ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!