ఆ పాత్రలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించడానికి వీల్లేదు!.. స్టార్ హీరోపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్

Updated on Dec 08, 2022 07:10 PM IST
ఛత్రపతి శివాజీ లాంటి మహావీరుడి పాత్రలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించడానికి వీల్లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు
ఛత్రపతి శివాజీ లాంటి మహావీరుడి పాత్రలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించడానికి వీల్లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు

బాలీవుడ్ టాప్ కథానాయకుల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఖాన్ త్రయాన్ని తట్టుకుని స్టార్ హీరోగా నిలబడ్డారాయన. మార్షలార్ట్స్‌లో నిపుణుడైన అక్షయ్.. తన సినిమాల్లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో మెస్మరైజ్ చేస్తుంటారు. ఎమోషనల్, రొమాంటిక్ సీన్లలోనూ మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తారు. అయితే అక్కీ బలం మాత్రం కామెడీనే. ఆయన కామెడీ టైమింగ్‌కు ఎవ్వరైనా పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. 

వినోదాత్మక చిత్రాలే కాకుండా సందేశాత్మక సినిమాలతోనూ హిట్లను అందుకోవడం అక్షయ్ కుమార్‌కే చెల్లింది. ‘టాయ్‌లెట్’ మూవీయే దానికి ఉదాహరణ. అలాగే ‘ఎయిర్ లిఫ్ట్’, ‘జాలీ ఎల్ఎల్ బీ’, ‘బేబీ’, ‘కేసరి’, ‘రుస్తుమ్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేయడమూ ఆయనకే చెల్లింది. అయితే ఈ మధ్య అక్షయ్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆయన నటించిన గత చిత్రాలు ‘లక్ష్మీ బాంబ్’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’, ‘రామ్ సేతు’ మూవీస్ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోవడంలో విఫలమయ్యాయి. 

అది నా అదృష్టం: అక్షయ్ కుమార్
వరుస పరాజయాలు పలకరించినా అక్షయ్ కుమార్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఆయన ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ (Vedat Marathe Veer Daudale Sat) అనే మరాఠీ సినిమాలో ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. దీనిని అక్షయ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘నేను ఛత్రపతి శివాజీగా కనిపించనున్నా. ఈ అవకాశం రావడం నా అదృష్టం. అందరి ఆశీస్సులతో నా శక్తిమేర అత్యుత్తమంగా నటించడానికి ప్రయత్నిస్తా’ అని రాసుకొచ్చారు. అయితే నెటిజన్స్ ఆయన్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 

ఈ పాత్రకు ఆయనే కరెక్ట్..!
శివాజీ లాంటి మహావీరుడి పాత్రలో అక్షయ్ నటించడానికి వీల్లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని అంటున్నారు. ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) కాలంలో బల్బు కనిపెట్టలేదని.. మరి వీడియోలో లైట్స్‌ ఎందుకు వాడారని ఒకరు కామెంట్‌ చేయగా.. శివాజీ పాత్ర పోషించడానికి మరాఠీలో మంచి నటుడే దొరకలేదా అంటూ మరొకరు విమర్శించారు. మహేష్‌ మంజ్రేకర్ ‌(Mahesh Manjrekar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన ఇటీవల మాట్లాడుతూ..‘ఛత్రపతి శివాజీ గురించి ఎన్నో విషయాలు భారతదేశమంతా తెలియాల్సి ఉంది. అందుకే అక్షయ్‌ లాంటి పాన్‌ ఇండియా నటుడ్ని ఎంపిక చేసుకున్నాం. ఆయన ఈ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతారు’ అని అన్నారు. అయితే, చాలా మంది నెటిజన్స్ మాత్రం ఈ రోల్‌కు శరద్‌ కేల్కర్‌(Sharad Kelkar) సరిగ్గా సరిపోతారని అంటున్నారు. మరి, ఈ మూవీతో ఆడియెన్స్‌ను అక్షయ్ ఎంతమేర ఆకట్టుకుంటారో చూడాలి. 

Read more: తల్లయ్యాక నేను చాలా మారా.. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఆలోచిస్తున్నా: అలియా భట్ (Alia Bhatt)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!