Mega Heroes: సంక్రాంతి బరిలోకి మెగా హీరోలు! అభిమానులకు నిజంగా పండుగే

Updated on Jul 07, 2022 12:33 PM IST
2023 సంక్రాంతి రేసులోకి రావడానికి, మెగా హీరోలు (Mega Heroes) రెడీ అవుతున్నారని సమాచారం. సినిమా విడుదలపై క్లారిటీ రాకున్నా.. వారు రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది
2023 సంక్రాంతి రేసులోకి రావడానికి, మెగా హీరోలు (Mega Heroes) రెడీ అవుతున్నారని సమాచారం. సినిమా విడుదలపై క్లారిటీ రాకున్నా.. వారు రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది

మెగాస్టార్ చిరంజీవి, పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్, మెగాపవర్‌‌స్టార్‌‌ రాంచరణ్‌, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సహా మెగా హీరోల (Mega Heroes) సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే, థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే, ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. అదే మెగా హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో రిలీజ్ అవుతున్నాయంటే, ఫ్యాన్స్‌ ఆనందానికి లిమిట్స్ ఉండవు.

ఒకటి రెండు సినిమాలను పక్కన పెడితే, 2022 సంక్రాంతికి సినిమాల సందడి పెద్దగా కనిపించలేదు. ఆ లోటును తీర్చడానికి మెగా హీరోలు రెడీ అవుతున్నారు. 2023 సంక్రాంతి సీజన్‌లో వరుసగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి, మెగాస్టార్ చిరంజీవి, పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సంక్రాంతి రేసులో ఇప్పటికే పలు సినిమాలను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

రిలీజ్ డేట్స్‌పై నో క్లారిటీ..

ఇక, 2023 సంక్రాంతి రేసులోకి రావడానికి, మెగా హీరోలు (Mega Heroes) రెడీ అవుతున్నారని సమాచారం. సినిమా విడుదలపై క్లారిటీ రాకున్నా.. వారు రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చేయనున్నట్టు మెగాస్టార్ హింట్ ఇచ్చారు. పవర్‌‌స్టార్‌‌, మెగాపవర్‌‌స్టార్‌‌ కూడా ఇలాగే ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్.

మెగా154 సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్

‘మెగా 154’లో చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మెగా154 వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌‌లోనే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ విదేశాలకు కూడా వెళ్లినట్టు వార్తలు కూడా వచ్చాయి.

హరిహర వీరమల్లు సినిమా పోస్టర్

జానపద చిత్రంతో పవర్‌‌స్టార్..

పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. జానపద చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. 17వ శతాబ్దంలో జరిగే పీరియాడికల్‌ కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు క్రిష్. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆగుతూ,ఆగుతూ షూటింగ్ జరుపుకుంటున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు క్రిష్.  

రాంచరణ్‌ – శంకర్‌‌ సినిమా పోస్టర్‌‌

పాన్ ఇండియా సినిమాతో రాంచరణ్..

మెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఆర్‌‌సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తర్వాత రాంచరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఆర్‌‌సీ 15పై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్‌గా రెండోసారి చరణ్ పక్కన జతకడుతోంది.

సునీల్, జయరామ్, శ్రీకాంత్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్ జే సూర్య విలన్‌గా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే 2023 సంక్రాంతి సీజన్‌లో మెగా హీరోల (Mega Heroes) సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అనే విషయం తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు.

Read More :  ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!