చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్

Updated on Jul 02, 2022 06:42 PM IST
చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్‌ నటించిన ఆచార్య సినిమా పోస్టర్, పరుచూరి గోపాలకృష్ణ
చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్‌ నటించిన ఆచార్య సినిమా పోస్టర్, పరుచూరి గోపాలకృష్ణ

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), రాంచరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా ఏప్రిల్‌ 29వ తేదీన రిలీజై డివైడ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఇటీవలే ‘ఆచార్య’ చూశానని ఆ సినిమాపై సోషల్‌ మీడియాలో పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి, రాంచరణ్ ఇద్దరూ కలిసి నటించిన ఆచార్య సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ పెట్టకుండా ఉంటే బాగుండేదని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఈ సినిమా చూస్తుంటే తాను రాసిన ‘మరో మలుపు’ సినిమా గుర్తొచ్చిందని చెప్పారు.

‘సినిమాగా చూస్తే ఆచార్యలో తప్పు లేదు. కానీ, కథలో ముఖ్యమైన సంఘటన.. ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనేది చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని అయోమయంలోకి నెట్టింది. సస్పెన్స్‌, సెంటిమెంట్‌ ఒకే చోట ఉండలేవు. రాంచరణ్‌ పోషించిన సిద్ధ క్యారెక్టర్‌‌ సినిమా ఫస్టాఫ్‌లోనే వచ్చి ఉంటే బాగుండేది. మొత్తంగా కాకపోయినా కొంతైనా సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో చూపించి ఉంటే మరో విధంగా ఉండేది. డైలాగ్‌లు, కథాంశం, పెర్ఫార్మెన్స్‌ బాగున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు’ అని చెప్పారు గోపాలకృష్ణ.

చిరంజీవి

ఫలితం మరోలా ఉండేది..

‘రాంచరణ్‌ చేత ‘సిద్ధ’ క్యారెక్టర్‌‌ చేయించకుండా ఉంటేనే బాగుండేదేమో. ఫ్లాష్‌ బ్యాక్‌ కేవలం 10 శాతం ఉంచి, 90 శాతం కథలో చిరంజీవి ఉండుంటే ఆచార్య సినిమా ఫలితం మరోలా ఉండేది. సంగీతం సరిగ్గా కుదరలేదు. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉన్న పాత్ర చేస్తున్న చిరంజీవి డ్యాన్స్‌లు చేయకుండా ఉంటే బాగుండేది ఈ సినిమాకి ‘ఆచార్య’ టైటిల్‌ కరెక్ట్‌ కాదని అనిపించింది’ అని పరుచూరి గోపాలకృష్ణ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు.

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన చిరంజీవి (Chiranjeevi)  ‘ఆచార్య’ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించారు. 1980లలో ఎన్నో విప్లవాత్మక సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. కొన్నాళ్లకు ఆ తరహా సినిమా కథలను రచయితలు రాయడం మానేశారు. దాంతో దర్శకులు కూడా విప్లవాత్మక సినిమాలు తీయడం లేదు. ఈ సమయంలో విప్లవాత్మక సినిమా తీయాలని, మంచి సందేశాన్ని ప్రజలకు అందించాలని దర్శకుడు కొరటాల శివ అనుకోవడం, దానికి చిరంజీవి ఒప్పుకోవడంతో ఆచార్య సినిమా తెరకెక్కింది.

Read More : కామెడీ ఇష్టపడే సినీ ప్రేమికులు మిస్ కాకూడని పది టాలీవుడ్‌ (Tollywood) సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!