రాంచరణ్‌(Ram Charan) ఎంట్రీ సీన్‌ కోసం డైరెక్టర్ శంకర్ ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే

Updated on Jul 04, 2022 06:15 PM IST
రాంచరణ్‌ (Ram Charan), కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్
రాంచరణ్‌ (Ram Charan), కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్

మెగా పవర్‌‌స్టార్ రాంచ‌ర‌ణ్ (Ram Charan) వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఘ‌న విజ‌యం సాధించి, రికార్డులను కొల్లగొట్టింది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో రాంచ‌ర‌ణ్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. మెగాస్టార్‌‌ చిరంజీవికి తగ్గ కొడుకుగా బాలీవుడ్ ప్రముఖులు కూడా చ‌ర‌ణ్‌ను ప్రశంసించారు.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలో చరణ్‌ తన పాత్రలో నటించాడు అనేకంటే జీవించాడు అనడం కరెక్ట్‌. ఆ సినిమా విజయం ఇచ్చిన జోష్‌తో రాంచరణ్‌ తన తదుపరి ప్రాజెక్టుల షూటింగ్స్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చరణ్‌ శంకర్‌‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఆర్‌‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

రాంచరణ్‌ (Ram Charan), డైరెక్టర్ శంకర్

భారీ అంచనాలు..

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి సూపర్‌‌హిట్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న సినిమా కావడంతో చరణ్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులకు కూడా శంకర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా నెట్‌లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

రాంచ‌ర‌ణ్ (Ram Charan) ఎంట్రీ సీన్‌ కోసం శంక‌ర్ భారీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో దాదాపు రూ.10 కోట్లతో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సినిమా చరణ్‌ ఎంట్రీ సీన్లను ఈ సెట్‌లో చిత్రీకరించనున్నారని టాక్. ఇక, ఇటీవ‌ల హెయిర్ స్టైలిస్ట్ రిలీజ్ చేసిన చరణ్‌ స్టైలిష్‌ లుక్‌ వీడియోకు విపరీతమైన ఆదరణ లభించింది.

ఈ సినిమాలో చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ న‌టిస్తోంది. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్న శంకర్‌‌ – రాంచరణ్‌ (Ram Charan) కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్, న‌వీన్ చంద్ర కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!