Pawan Kalyan : విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్.. పిక్స్ వైరల్

Updated on Jun 23, 2022 12:15 PM IST
విశ్వక్‌సేన్‌ కొత్త సినిమా ముహర్తం షాట్‌కు క్లాప్ కొడుతున్న పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌
విశ్వక్‌సేన్‌ కొత్త సినిమా ముహర్తం షాట్‌కు క్లాప్ కొడుతున్న పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌

‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా విజయం తెచ్చిన జోష్‌లో ఉన్నాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్. ప్రస్తుతం విశ్వక్‌.. నటుడు, డైరెక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటీవలే ప్రకటన కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఆ పూజా కార్యక్రమానికి పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్‌ తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యాడు. ఈ సినిమాతో అర్జున్ కూతురు.. ఐశ్వర్యా అర్జున్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సీనియర్ హీరో జగపతి బాబు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది.  

డైరెక్టర్ అర్జున్‌తో పవన్‌ కల్యాణ్

మ్యూజిక్ అందించనున్న రవి బస్రూర్

శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి కేజీఎఫ్‌ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా,, నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు చంద్రబోస్ లిరిక్స్ అందించనున్నారు.  

విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం మే 6న విడుదలై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్.. అల్లం అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్‌‌లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్‌‌స్టార్.. విశ్వక్‌సేన్‌ సినిమా లాంచ్ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొడుతూ, అర్జున్‌తో మాట్లాడుతూ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) సందడి చేశారు.  

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో మోహన్‌బాబు, శోభన? త్వరలో అధికారిక ప్రకటన!

విశ్వక్‌సేన్‌ కొత్త సినిమా  పోస్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!