సెన్సిబిలిటీ ఉండే కథలనే సెలెక్ట్‌ చేసుకుంటా..‘మది’ ఒక డిఫరెంట్‌ లవ్ స్టోరి: శ్రీరామ్‌ నిమ్మల(Shreeram Nimmala)

Updated on Nov 08, 2022 01:15 PM IST
ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు
ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రతి సంవత్సరం అనేకమంది యువ హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాలపై ఉండే ప్రేమతో, కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తూ నిత్యం శ్రమిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాల మీదున్న పిచ్చితో కొందరు భాగ్య నగరంలో అడుగుపెడితే.. మరికొందరు నటించాలనే బలమైన ఆకాంక్షతో ఫిల్మ్ నగర్ వీధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

తమ అభిమాన హీరోలను ఆదర్శంగా తీసుకొని ఎందరో కృష్ణానగర్ బాట పడితే.. చాలామంది యువకులు సినిమా హీరోలు కావడమే లక్ష్యంగా ఫిల్మ్ సిటీ ప్రాంగణాలలో కాపు కాస్తున్నారు.

సినీ రంగం అంటేనే ఓ మాయా ప్రపంచం. కష్టాన్ని బట్టే ఫలితం ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఆవగింజంత అదృష్టం కూడా  తోడైతే, దశ..దిశ రెండూ మారిపోతాయి. ఎందరో ప్రతిభావంతులకు స్వాగతం పలికే కళామతల్లి తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ పరిశ్రమలో తనదైన శైలిలో రాణిస్తున్న మరో కొత్తతరం నటుడు శ్రీరామ్ నిమ్మల (Shreeram Nimmala).

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

తన ప్రతిభా పాటవాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరో శ్రీరామ్ నిమ్మల,  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు గొప్ప అభిమాని. మెగాస్టార్ చిరంజీవి ప్రేరణతో ఈయన సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్ లాంటి సినిమాలు చేసిన శ్రీరామ్.. ఇటీవలే ‘రుద్రవీణ’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆయన హీరోగా నటించిన మరో సినిమా ‘మది’ త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు శ్రీరామ్‌తో పింక్‌విల్లా చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

హాయ్‌ శ్రీరామ్‌ గారు.. ఎలా ఉన్నారు ? మది సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నట్టున్నారు ?

వెరీ ఫైన్. ‘మది’ సినిమా టీజర్‌‌కు స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే వివిధ కాలేజీలకు వెళ్తూ, మేం చేసే ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదో మంచి టీనేజీ లవ్‌స్టోరి. మేం ఎక్కడికి వెళ్లినా యూత్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.

మీ బాల్యం, కుటుంబ నేపథ్యం, స్టడీస్.. వీటి గురించి చెబుతారా ?

మాది హైదరాబాద్ శివార్లలోని దుండిగల్. పుట్టింది, పెరిగింది అంతా అక్కడే. నాన్న బిజినెస్ చేస్తుంటారు. అమ్మ హౌస్‌ వైఫ్‌. టెన్త్‌ క్లాస్ వరకు గండిమైసమ్మలోని డాన్‌ బాస్కో స్కూల్‌లో చదివాను. ఇంటర్మీడియట్‌ శ్రీచైతన్య (ఐడీపీఎల్‌)లో, ఎస్‌ఆర్‌‌ నగర్‌‌లోని గండికోట బిజినెస్‌ స్కూల్‌లో బీకాం (కంప్యూటర్స్‌)  పూర్తి చేశాను. తమ్ముడు సాఫ్ట్‌వేర్‌‌ ఉద్యోగం చేస్తున్నాడు.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

మీరు ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు ? ఈ ఏడాదిలోనే మీరు నటించిన మూడు సినిమాలు విడుదలవుతున్నాయి ? దీనిపై మీ స్పందన ఏంటి ?

2020 లోనే సాఫ్ట్‌వేర్ బ్లూస్, మది సినిమాలు మొదలయ్యాయి. ఆ ఏడాది చివరికే షూటింగ్స్‌ దాదాపుగా పూర్తయ్యాయి. అయితే కరోనా కారణంగా ఈ సినిమాల విడుదల ఆలస్యమైంది. ఇక 2021లో 'రుద్రవీణ' సినిమా షూటింగ్ మొదలైంది. చాలా వేగంగానే షెడ్యూల్స్ అన్ని పూర్తిచేశాం. ఇక 'సాఫ్ట్‌వేర్‌‌' బ్లూస్ సినిమా ఇప్పటికే  రిలీజై నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

నిజానికి రుద్రవీణ, మది.. ఈ రెండు సినిమాలు అక్టోబర్‌‌ 28వ తేదీనే విడుదల కావాల్సింది. అదే సరైన తేదీ అని ఈ రెండు సినిమాల నిర్మాతలు అనుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల విడుదలకు మధ్య రెండు వారాల వ్యవధి ఉంటే బాగుంటుందని మేం భావించాం. అందుకే 'మది' సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయ్యింది. ‘మది’ సినిమా నవంబర్‌‌ 11వ తేదీన విడుదల కానుంది.

ఇండస్ట్రీకి రావడానికి మీ ప్రేరణ ఎవరు ? అలాగే మీ అభిమాన నటీనటుల గురించి చెప్పండి ?

చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఏ సినిమా చూసినా.. అందులో హీరో చేసే డాన్స్‌లు, చెప్పే డైలాగ్స్‌ను ఇంటికి వెళ్లి ఇమిటేట్‌ చేసేవాడిని. 'ఆ హీరోలా ఉండాలి, ఈ హీరోలా ఉండాలి' అని అనుకునేవాడిని. అయితే ఇండస్ట్రీకి రావడానికి ఇన్‌స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు.

కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. ఏ రంగంలోని వారికైనా చిరంజీవి గారే ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పవచ్చు. 'సినిమా అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే సినిమా' అనేంతగా ఎదిగారు ఆయన. ఇక హీరోగా నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయనకు నేను హార్డ్‌ కోర్‌‌, డై హార్డ్‌ ఫ్యాన్‌ని. అలాగే హీరోయిన్లలో సోనాలి బింద్రే నా ఫేవరెట్.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

ప్రభాస్ అంటే ఎందుకు మీకంత ఇష్టం ?

ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టమంటే ఏమని చెప్పగలను? పవన్‌ కల్యాణ్‌ గారి ఫ్యాన్స్‌ను 'ఆయనంటే ఎందుకు ఇష్టం' అంటే ఏం చెప్తారు? డై హార్డ్‌ ఫ్యాన్స్‌‌కి తమ అభిమాన హీరోలలో అన్ని గుణాలూ ఇష్టమే. సినిమాల్లోని నటన, వ్యక్తిగత జీవితం, వారి ప్రవర్తన.. అన్నింటినీ వారు ఇష్టపడతారు. నాకు ప్రభాస్ కటౌట్‌, మేనరిజం అన్నీ  తెగ నచ్చేస్తాయి.

ప్రభాస్‌ను ఎప్పుడైనా కలిశారా ?

లేదండీ. ఇప్పటివరకు అయితే ప్రభాస్‌ను కలవలేదు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత, ఆయనను కలవాలని అనుకుంటున్నాను. ప్రభాస్‌ దగ్గరకు వెళ్లి, నన్ను నేను పరిచయం చేసుకున్నాక "శ్రీరామ్ నాకెందుకు తెలీదు.. మంచి ఆర్టిస్ట్‌" అని ఆయన చెప్పే స్థాయికి నేను ఎదగాలి. అలాంటి రోజు వచ్చిందని నాకు నమ్మకం కుదిరినప్పుడు, ఆయనను తప్పకుండా కలుస్తాను.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

ఉత్తర, సాఫ్ట్‌వేర్‌‌ బ్లూస్‌, రుద్రవీణ ఈ మూడు సినిమాల్లో వివిధ క్యారెక్టర్లలో కనిపించారు ? 'మది' సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశారు?

'ఉత్తర' సినిమాలో పల్లెటూరి అబ్బాయిగా చేశాను. ఆ తర్వాత ‘సాఫ్ట్‌వేర్‌‌ బ్లూస్‌’లో ఐటి ఉద్యోగి పాత్ర పోషించాను. కానీ 'రుద్రవీణ' సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్‌లో నటించాను. 'మది' సినిమాలో మాత్రం.. ఈ మూడు క్యారెక్టర్లకీ భిన్నంగా ఉండే పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన నాలుగు సినిమాల్లోనూ.. నాలుగు విభిన్నమైన క్యారెక్టర్స్‌ చేశాను.

డైరెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు ఏ ఏ అంశాలను గమనిస్తుంటారు ? 'మది' సినిమా ఓకే చేయడానికి కారణం ఏమిటి ?

కథలో సెన్సిబిలిటీ ఉందా, లేదా ? అనే విషయాన్ని గమనిస్తాను. లాజిక్ మిస్ కాకుండా ఉండేలా చూసుకుంటాను. ఒక ప్రేక్షకుడి కోణంలో నుంచి కథ వింటాను. ప్రేక్షకుడికి కథ నచ్చితే, ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.

'మది' సినిమా కథలో సెన్సిబిలిటీ ఉంటుంది.  ఒక డిఫరెంట్ లవ్‌ స్టోరీగా 'మది' సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ నాగ ధనుష్‌. ఇద్దరు ప్రేమికులు మెచ్యూర్డ్‌గా ఫీల్‌ అవుతూ, ఇమ్మెచ్యూర్డ్‌గా తీసుకున్న నిర్ణయమే ‘మది’ సినిమా కథలోని ప్రధాన అంశం.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

'మది' సినిమా హీరోయిన్‌ రిచా జోషితో  పనిచేయడం ఎలా ఉంది?

రిచా జోషి పని పట్ల చాలా అంకితభావం కలిగిన అమ్మాయి. అలాగే ఓపెన్ మైండెడ్ కూడా. ఆమె చేసే హార్డ్ వర్క్‌ను నేను సెట్స్‌లో చూశాను. ఈ సినిమాలో రిచా క్యారెక్టర్‌‌ చాలా ఎమోషన్‌తో నిండి ఉంటుంది. తన పాత్రలో ఒదిగిపోయి నటించారామె. షూటింగ్‌లో కూడా చాలా ఓపికగా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి ప్రయత్నించేవారామె. 

మీ డ్రీమ్‌ రోల్‌ ఏంటి ? ఈ సినిమా తర్వాత మీరు చేయబోయే ప్రాజెక్టుల గురించి చెప్పండి ?

'బాహుబలి' లాంటి సోషియో ఫాంటసీ సినిమా చేయాలనేది నా కల. అయితే దానికి చాలా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే నా జర్నీ ప్రారంభమైంది. అలాగే 'బుజ్జిగాడు' సినిమాలో ప్రభాస్ చేసిన మాస్ క్యారెక్టర్‌‌ లాంటిది కూడా చేయాలి.

మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండే క్యారెక్టర్‌‌‌లంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, అందులో చాలా సహజత్వం ఉంటుంది. ఆటో డ్రైవర్.. డబ్బావాలా లాంటి పాత్రలు చేయాలని ఉంది.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram)..‘మది’ సినిమాతో వస్తున్నారు

ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి?

ప్రస్తుతం ‘తురుమ్‌ఖాన్‌లు’, ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’  అనే సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ దాదాపుగా పూర్తయ్యాయి. 'తురుమ్‌ఖాన్‌లు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక పోసాని కృష్ణమురళి, బంచిక్ బబ్లూ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇండస్ట్రీకి రావాలని అనుకునే వాళ్లకు మీరేమైనా చెప్పాలని భావిస్తున్నారా ?

ఇండస్ట్రీలో నాకు తెలిసినవాళ్లు ఎవరూ లేరు. నాకు నేనుగా అవకాశాల కోసం ప్రయత్నించాను. నాకు వచ్చిన అవకాశాలన్ని కూడా కష్టపడి సాధించినవే. ఏదేమైనా, కష్టపడిన సందర్భాలను నేనెప్పుడూ గుర్తుపెట్టుకోను. ఎందుకంటే కష్టపడే పనిని కూడా నేను ఇష్టపడే చేస్తాను. కేవలం మంచి విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటాను.

ఇండస్ట్రీలోకి రావాలి, ఏదైనా సాధించాలి? అనేవాళ్లకు కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది.

(ఏ నటుడికైనా టాలెంట్ ఒక్కటే సరిపోదని.. కష్టాన్ని కూడా ఇష్టపడి స్వీకరిస్తేనే విజయ తీరాలను చేరుకోవచ్చని చెబుతున్న శ్రీరామ్ నిమ్మల (Shreeram Nimmala).. ప్రేక్షకులను మరింతగా అలరిస్తూ.. స్టార్ హీరో స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది పింక్‌విల్లా.

‘మది’ సినిమా సూపర్‌‌ హిట్‌ కావాలని ఆకాంక్షిస్తూ..

ఆల్‌ ది బెస్ట్.. శ్రీరామ్‌..

Read More : EXCLUSIVE : కష్టాన్ని కూడా ఇష్టపడాలి.. అదే నా విజయ రహస్యం : సంగీత దర్శకుడు రఘు కుంచె (Raghu Kunche)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!