Mahesh Babu : మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ !

Updated on Sep 29, 2022 04:59 PM IST
మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడనుందని టాక్.
మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడనుందని టాక్.

మహేష్ బాబు (Mahesh Babu) .. టాలీవుడ్ ప్రిన్స్‌గా సుపరిచితుడైన నటుడు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో (Trivikram) ఖలేజా, అతడు లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన మహేష్.. ఇప్పుడు మూడోసారి ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి సిద్ధమవ్వడం విశేషం. ఇది అతని కెరీర్‌లోనే 28 వ చిత్రం. ఈ సినిమాకి "ఆరంభం" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. 

మొదటి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం 

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో పలు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. అలాగే రెండవ షెడ్యూల్‌ను విజయదశమి తర్వాత ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇక్కడే ఒక సమస్య. మహేష్ తన తల్లి ఇందిరా దేవి మరణించడంతో సెట్స్‌కి ఎప్పుడు వస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. 

మరో విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడిందట. ముఖ్యంగా డిజిటల్, శాటిలైట్ హక్కులకు మంచి రేట్ దక్కనుందని వినికిడి. ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) సరసన నటి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్ 

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి చినబాబు, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేష్ - త్రివిక్రమ్ సినిమా అనగానే అది ఎప్పుడూ క్రేజీ కాంబినేషనే. అలాగే ఇద్దరు ప్రస్తుతం సక్సెస్ బాటలో నడుస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 

అయితే.. మహేష్ బాబు (Mahesh Babu) తన తల్లి ఇందిరాదేవి మరణంతో విషాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Read More: మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమా 'ఎస్ఎస్ఎంబి 28' కొత్త అప్‌డేట్.. మ‌హేష్ లుక్ కేక అంటున్న ఫ్యాన్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!