Exclusive: మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళితో చేసే సినిమా సబ్జెక్టు ఏమిటి? అడివి శేష్ "గూఢచారి"కి ప్రేరణ ఎవరు?

Updated on Jun 06, 2022 01:45 PM IST
"గూఢాచారి" చేస్తున్నప్పుడు, తొలుత కృష్ణ గారిని సంప్రదించి, తమ చిత్రంలో కామియో రోల్ చేయమని అడిగానని, కానీ ఆయన ప్రేమతో ఆ ఆఫర్ తిరస్కరించారని అంటూ శేష్ (Adivi Sesh) తన అనుభవాలను పంచుకున్నారు. 
"గూఢాచారి" చేస్తున్నప్పుడు, తొలుత కృష్ణ గారిని సంప్రదించి, తమ చిత్రంలో కామియో రోల్ చేయమని అడిగానని, కానీ ఆయన ప్రేమతో ఆ ఆఫర్ తిరస్కరించారని అంటూ శేష్ (Adivi Sesh) తన అనుభవాలను పంచుకున్నారు. 

మహేష్ బాబు తో ముఖాముఖి : పింక్‌‌విల్లా ఇంటర్వ్యూ

Mahesh Babu:  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవలే పింక్ విల్లా టీమ్‌తో తన మదిలోని భావాలను పంచుకున్నారు. 'మేజర్' సినిమా ప్రమోషన్స్‌కు వచ్చిన మహేష్ తను రాజమౌళితో చేయబోయే చిత్రం గురించి ఓ హింట్ ఇచ్చారు. అది ఓ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ అని గతంలో రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన మాట నిజమా కాదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, దీని గురించి తాను ఏమీ మాట్లాడలేనన్నారు. 

ఆ విషయంపై అప్పుడే మాట్లాడను : మహేష్ బాబు 

ఈ సినిమా మీద రాజమౌళికి చాలా ఐడియాలు ఉన్నాయని, కనుక ఏదో ఒకటి ఫైనలైజ్ చేసేవరకు, తాను ఏమీ మాట్లాడలేనన్నారు. కాకపోతే, ఈ సినిమా చేసేందుకు తాను చాలా ఆసక్తితో ఉన్నానని తెలిపారు మహేష్. అలాగే అడివి శేష్ మాదిరిగా ఎందుకు తన సినిమాలకు సీక్వెల్స్ చేయడం లేదన్న ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు. తనకు అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదన్నారు. కానీ ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తానన్నారు. 

మీరు 'మేజర్' చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడానికి కారణం ఏమిటి?  అని  విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు కూడా మహేష్  బాబు సమాధానమిచ్చారు. 

"అడివి శేష్ నటించిన సినిమాలన్నీ నేను చూశాను. అవి అన్నీ నాకు నచ్చాయి. క్షణం, ఎవరు, గూఢాచారి.. ఇవన్నీ మంచి సినిమాలే. అలాగే దర్శకుడు శశి కూడా మంచి టెక్నీషియన్. అందుకే నిర్మాతలు అనురాగ్, శరత్‌లు వచ్చి నన్ను అడిగినప్పుడు, వెంటనే సరేనన్నాను. వారు నాతో కలిసి పనిచేశారు కూడా. వారు మేజర్ ఉన్నిక్రిష్ణన్ కథను బయోపిక్‌గా తీస్తామని ఎప్పుడైతే చెప్పారో, ఇది తప్పక అందరూ తెలుసుకోవాల్సిన కథ అనిపించింది.

శేష్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి, కచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుందని అనుకున్నాను. ఈ సినిమా చూశాక, నా నిర్ణయం తప్పు కాదని అనిపించింది. ఈ టీమ్‌ను చూసి చాలా గర్వపడుతున్నాను. అలాగే ఆనందిస్తున్నాను కూడా" అని మహేష్ తెలిపారు.

ఇదే విషయం పై నటుడు అడివి శేష్ కూడా స్పందించారు.  "మహేష్ మనుషులను నమ్ముతారు. ఈ నమ్మకంతోటే ఈ ప్రాజెక్టుకు సహకరించారు. నమ్రత గారైతే తొలుత స్క్రిప్ట్ గురించి అడిగారు. సినిమా ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలపమని కోరారు. కానీ, మహేష్ మాత్రం ఇవేవీ అక్కర్లేదు అంటూ, మా మీద పూర్తి నమ్మకంతో వెంటనే ఒప్పుకున్నారు. ఆయన ఈ సినిమా చూసిన రాత్రే నేను కాల్ చేశాను. ఆయన ఒకటే మాటన్నారు. ఆయన నమ్మకం వమ్ముకాలేదని" అని శేష్ తెలిపారు.

టెస్ట్ స్క్రీనింగ్ అనేది ఓ వినూత్నమైన పద్థతి :  మహేష్ బాబు

'మేజర్' చిత్రాన్ని టెస్ట్ స్క్రీనింగ్ పద్ధతి ద్వారా ప్రమోట్ చేయడం గురించి మహేష్ బాబు స్పందించారు.

"ఇప్పటికి బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ ఒక్కరే ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు మేం కూడా అదే బాటలో వెళ్తున్నాం. ఇది చాలా అద్భుతమైన ఐడియా. నేనైతే నా సినిమాలతో ఎప్పుడూ ఈ ప్రయోగం చేయలేదు.అందుకే దక్షిణాదిలో మేం ఈ పద్ధతిని అనుసరిస్తామని కరాకండీగా చెప్పను. కానీ 'మేజర్' విషయంలో శేష్ అడిగాడు కాబట్టి, ఈ ప్రయోగానికి ఒప్పుకున్నాం.

మేము ఎంపిక చేసిన గ్రూప్ ఆఫ్ ఆడియన్స్‌కు ఈ సినిమాని ప్రదర్శించాం. బొంబాయిలో కూడా అనేక చోట్ల షోస్ వేశాం. గత నెల రోజులుగా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాం. నేను కూడా నిన్న రాత్రి సినిమా చూశాకే, ఈ టెస్ట్ స్క్రీనింగ్‌కు ఉన్న ఆదరణ ఏంటో అర్థమైంది. అయితే మనం ఇలాంటి ప్రదర్శనలు అందించాలంటే, సమయం కూడా సహకరించాలి.

సాధారణంగా ఒక సినిమాను విడుదలకు ముందే ప్రజలకు చూపించాలంటే అదో పెద్ద తతంగం. సాధారణంగా సినిమా ఎడిటింగ్ వర్క్ జరిగాక, అదే చిత్రాన్ని మన సన్నిహితులకో, స్నేహితులకో చూపిస్తాం. కానీ టెస్ట్ స్క్రీనింగ్ విషయంలో అయితే మన పరిమితుల్ని దాటి వెళ్లాలి. బయట జనానికి సినిమాను చూపించి, వారి అభిప్రాయాన్ని అడగాలి.

ఇక్కడ తొలుత బొంబాయిలోని ప్రెస్ వాళ్ళ కోసం ఒక షో వేశాం. తర్వాత, మళ్లీ కొన్ని సంఘాలకు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించాం. మీ సినిమాను విడుదలకు ముందే జనాలకు చూపించి కూడా, అదే చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయడం అంటే సాహసమే. అలా రిలీజైన చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడం అంటే ఆషామాషీ విషయం కాదు. మీరు చాలా నమ్మకంగా ఉంటేనే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు" అని మహేష్ అభిప్రాయపడ్డారు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢాచారి 116 సినిమా నాకు ప్రేరణ : అడివి శేష్

ఇదే క్రమంలో అడివి శేష్ (Adivi Sesh), తాను నటిస్తున్న హిట్, గూఢాచారి సినిమాల సీక్వెల్స్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన సినిమాకి ప్రేరణ సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢాచారి 116, 117 సినిమాలు అని తెలిపారు. అలాగే ఆయన నటించిన ఏజెంట్ గోపీ సినిమాకి కూడా తను పెద్ద ఫ్యాన్‌ని అని అన్నారు. 

కృష్ణ గారు మా విన్నపాన్ని తిరస్కరించారు : అడివి శేష్

తాను "గూఢాచారి" చేస్తున్నప్పుడు, తొలుత కృష్ణ గారిని సంప్రదించి, తమ చిత్రంలో కామియో రోల్ చేయమని అడిగానని, కానీ ఆయన ప్రేమతో ఆ ఆఫర్ తిరస్కరించారని అంటూ శేష్ (Adivi Sesh) తన అనుభవాలను పంచుకున్నారు. 

అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢాచారి 116 సినిమాలోని క్లిప్స్ వాడుకోవడానికి పర్మిషన్ అడిగితే, ఆయన నిరభ్యంతరంగా వాడుకోవచ్చని తెలిపారని శేష్ చెప్పారు. అలాగే హిట్ 2 సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ.. అదంతా నటుడు నాని నిర్మాతగా తన మీద పెట్టుకున్న నమ్మకమే అని బదులిచ్చారు. 

Read : ఈ కథ చాలా ముఖ్యమైన కథ, అందరూ తెలుసుకోవాల్సిన కథ.. ఇదే మహేష్ బాబు (Mahesh Babu) మదిలోని మాట !

Advertisement
Credits: PINKVILLA EXCLUSIVE

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!