దళపతి విజయ్ (Vijay) & లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరోయిన్‌గా త్రిష (Trisha).. 14 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్ !

Updated on Sep 21, 2022 05:53 PM IST
త్రిష, విజయ్ కాంబినేషన్‌లో (Trisha-Vijay) ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి.
త్రిష, విజయ్ కాంబినేషన్‌లో (Trisha-Vijay) ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి.

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Hero Vijay) హీరోగా ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' (Varasudu) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ ద్విభాషా చిత్రం.. ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు విజయ్. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. లోకేష్ స్టైల్‌లోనే మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక ఇందులో విజయ్‌కి ప్రతినాయకుడుగా, సంజయ్ దత్‌ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

'విక్రమ్' మూవీ పోస్టర్

'విక్రమ్' (Vikram Movie) సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈయన ఇప్పటికే  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.  ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారట. 

అందులో ఒక హీరోయిన్‌గా త్రిష (Trisha) ఎంపికయ్యిందట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా సమంత (Samantha) ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, అతనికి అసిస్టెంట్ పాత్రలో సమంత కనిపించనుందని సమాచారం.

ఇక త్రిష, విజయ్ కాంబినేషన్‌లో (Trisha-Vijay) ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ కూడా మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. 2008లో వీరిద్దరూ కలిసి చివరిసారిగా నటించారు. మరలా 14  ఏళ్ళ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చివరి సారిగా 14 ఏళ్ల క్రితం 'కురువి'  అనే చిత్రంలో వీరు జంటగా కనిపించి మురిపించారు. ఇక సమంత, విజయ్ కాంబినేషన్ లో 'కత్తి', 'మెర్సల్', 'తెరి' సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

Read More: Kaithi Sequel: కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) నటించిన 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ.. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!