విజయ్, అజిత్ గురించి ఒక్క మాటలో తేల్చేసిన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty).. ఇంతకీ ఏం చెప్పిందంటే?

Updated on Sep 17, 2022 06:08 PM IST
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది ఈ బ్యూటీ.
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది ఈ బ్యూటీ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty). ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ.. తీరిక లేకుండా బిజీగా మారింది. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది కృతిశెట్టి. 

ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali) సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది కృతిశెట్టి. అందులో వారు అడిగిన ప్రశ్నలకు సహనంగా సమాధానాలను ఇచ్చింది. ఈ క్రమంలోనే టాలీవుడ్.. కోలీవుడ్ స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 

ఒక అభిమాని నటుడు అజిత్ (Hero Ajith), విజయ్‌ల (Vijay) గురించి ఒక మాటలో చెప్పాలని అడగ్గా అజిత్‌ జెన్యూన్‌ పర్శన్‌ అని విన్నానని, అదేవిధంగా నటుడు విజయ్‌ ఇన్స్‌పైరింగ్‌ సూపర్‌స్టార్‌ అని పేర్కొంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ.. ఆయన రియల్‌గాను, రీల్‌లోనూ సూపర్‌స్టారే అని చెప్పింది ఈమె.

తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన 'ది వారియర్' (The Warrior) చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అందులో నటుడు శింబు పాడిన "బుల్లెట్‌ పాట" సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక  అందులో నటించిన కృతిశెట్టికి ఆ పాట తమిళంలోనూ క్రేజ్‌ తెచ్చి పెట్టింది. దీంతో వెంట వెంటనే నటుడు సూర్యతో పాటు, మరో సినిమాలో నాగచైతన్యతో కూడా రొమాన్స్‌ చేసే అవకాశాలను దక్కించుకుంది కృతి శెట్టి.

 

Read More: ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీరలో కనువిందు చేసిన కృతిశెట్టి (Krithi Shetty)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!