తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సర్దార్’ (Sardar) మూవీ.. కోలీవుడ్ స్టార్ కార్తి (Karthi) ఖాతాలో మరో హిట్

Updated on Oct 31, 2022 12:26 PM IST
తమిళ స్టార్ కథానాయకుడు కార్తి (Karthi) నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా తెలుగు నాట బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసింది
తమిళ స్టార్ కథానాయకుడు కార్తి (Karthi) నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా తెలుగు నాట బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసింది

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)కి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఒక విజయం, రెండు పరాజయాలుగా సాగుతున్న ఆయన కెరీర్.. ఈ సంవత్సరం ఒక్కసారిగా ఊపందుకుంది. కార్తి నటించిన మూడు చిత్రాలు 2022లో రిలీజ్ అయ్యాయి. అందులో ‘విరుమన్’, ‘సర్దార్’ ఆయన సోలో హీరోగా నటించినవి. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో కార్తి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

‘విరుమన్’ చిత్రం తమిళంలో మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ‘పసలపూడి వీరబాబు’గా తెలుగులోకి డబ్ చేసి.. ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్ 1’ పలు భాషల్లో విడుదలై మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా తమిళంలో ఈ మూవీ పలు రికార్డులను తుడిపేసింది. తమిళంలో హయ్యెస్ట్ టాప్–3 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ‘విరుమన్’తో విజయాన్ని అందుకొని ఊపుమీదున్న కార్తీలో.. ‘పీఎస్ 1’ సక్సెస్ మరింత జోష్ నింపింది. 

దీపావళి పండక్కి ‘సర్దార్’ (Sardar)గా మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చారు కార్తి. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా కార్తీకి మరో విజయాన్ని అందించింది. వంద కోట్ల మార్కును అందుకునే దిశగా ఈ ‘సర్దార్’ దూసుకెళ్తోంది. తెలుగులోనూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగు నాట తొమ్మిది రోజులకు కలిపి రూ.6.51 కోట్ల కోట్ల షేర్‌ను ‘సర్దార్’ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సంఖ్య రూ.10.90 కోట్లుగా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల టార్గెట్‌తో ‘సర్దార్’ దీపావళి రేసులో దిగింది. తొమ్మిది రోజుల్లో రూ.6.51 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తోపాటు రూ.1.01 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది. ఇప్పట్లో పెద్ద సినిమా రిలీజులు లేనందున ‘సర్దార్’ మూవీకి మంచి లాంగ్ రన్ ఉంది. ఇదే ఊపును కొనసాగిస్తే ‘సర్దార్’ తెలుగు వెర్షన్ రూ.10 కోట్ల షేర్‌ను సాధించడం అంత కష్టం కాకపోవచ్చు. 

ఇక ప్రాంతాల వారీగా ‘సర్దార్’ వసూళ్లను చూస్తే.. తమిళనాడులో రూ.36.30 కోట్లు, కర్ణాటకలో రూ.1.95 కోట్లు, కేరళలో రూ.1.30 కోట్లు, రెస్టాఫ్​ ఇండియాలో రూ.1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.45 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 64 కోట్ల గ్రాస్, రూ. 32.20 కోట్ల షేర్‌ను రాబట్టింది. కాగా, ‘సర్దార్’ మూవీని ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కార్తి సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటి లైలా కీలక పాత్ర పోషించారు. 

Read more: టాలీవుడ్‌లో సరికొత్త కాంబో.. 'సర్కారువారి పాట'(Sarkaruvaari Paata) డైరెక్టర్‌తో బాల‌కృష్ణ (Balakrishna) సినిమా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!