సూర్య (Suriya) షాడో నుంచి బయటపడి.. కార్తి (Karthi) స్టార్ అవ్వడం గ్రేట్: నాగార్జున (Nagarjuna Akkineni)

Updated on Oct 20, 2022 11:02 AM IST
అన్నయ్య సూర్య (Suriya) షాడో నుంచి బయటపడి కార్తి (Karthi) ఈ స్థాయికి ఎదగడం గొప్ప విషయమని కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అన్నారు
అన్నయ్య సూర్య (Suriya) షాడో నుంచి బయటపడి కార్తి (Karthi) ఈ స్థాయికి ఎదగడం గొప్ప విషయమని కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అన్నారు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (karthi) ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘విరుమన్’ (Viruman), ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఆయన.. ఈసారి ‘సర్దార్’ (Sardar)గా రానున్నారు. కార్తి నటించిన ‘సర్దార్’ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులోనూ అదే పేరుతో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ‘సర్దార్’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీతో తన స్నేహం గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కార్తీతో కలసి చేసిన ‘ఊపిరి’ సినిమాతో తమ మధ్య అనుబంధం మొదలైందని నాగార్జున అన్నారు.  

‘సర్దార్’ మూవీని అన్నపూర్ణ బ్యానర్ ద్వారా తెలుగులోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని నాగార్జున చెప్పారు. ట్రైలర్ అదిరిపోయిందని మెచ్చుకున్నారు. ట్రైలర్ గురించి కార్తీకి చెబితే.. తాను ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారని నాగ్ పేర్కొన్నారు. దీన్ని బట్టే ఈ ఫిల్మ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ‘కార్తి వాళ్ల అన్నయ్య సూర్య ఓ సూపర్ స్టార్. సూర్య (Suriya) షాడో నుంచి కార్తి బయటకొచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పర్చుకోవడం గొప్ప విషయం. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. తెలుగులో చిరంజీవి షాడో నుంచి పవన్ కల్యాణ్​ అలాగే బయటకొచ్చారు. కన్నడలో శివ రాజ్‌కుమార్ తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్.. తమిళంలో సూర్య సోదరుడు కార్తిలు అలాగే బయటకొచ్చి సక్సెస్ అయ్యారు’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. 

‘విభిన్నమైన సినిమాలను చేస్తూ అన్నయ్య సూర్యలా సూపర్ స్టార్ స్థాయికి కార్తి ఎదిగారు. ఇది అంత సులువు కాదు. తెలుగులో మాట్లాడటం, పాటలు కూడా పాడటం ఆయన స్పెషాలిటీ. అందుకే తెలుగు ప్రేక్షకులు కార్తి మూవీలను అంతగా ఆదరిస్తుంటారు. ఈ ‘సర్దార్’ మూవీని కూడా ఎప్పటిలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’ అని నాగ్ వివరించారు. అనంతరం కార్తి మాట్లాడుతూ.. నాగార్జున తనకు స్ఫూర్తి అన్నారు. మంచి నటుడవ్వాలంటే ముందు మంచి మనిషిగా మారాలని నాగ్ చెప్పిన మాటలు తనకు ఇన్‌స్పిరేషన్ అని కార్తి పేర్కొన్నారు. తాను నటించిన సినిమాలను ఆదరిస్తున్నందుకు తెలుగు ఆడియెన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘సర్దార్’ సినిమా తన కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రమని.. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని కార్తి వివరించారు. ఇక, ‘సర్దార్’ మూవీని ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కార్తి సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటి లైలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పీఎస్ 1’, ‘విరుమన్’తో హిట్లను అందుకున్న కార్తి.. ‘సర్దార్’తో అదే జోరును కొనసాగిస్తారేమో చూడాలి. 

Read more: కార్తీ నటించిన 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది... ఆ సినిమా తర్వాతే 'ఖైదీ 2' (Khaidi 2) షూటింగ్ స్టార్ట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!