కార్తీ (Karthi) నటించిన 'సర్దార్' (Sardar) సినిమాకు సీక్వెల్.. త్వరలో షూటింగ్ ప్రారంభం.. నిర్మాతల కీలక నిర్ణయం
తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సర్దార్’ (Sardar). ‘అభిమన్యుడు’ ఫేం పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా (Raashii Khanna), రజీషా విజయన్ కథానాయికలుగా నటించారు.
‘సర్దార్’ (Sardar) చిత్రంలో లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో దీపావళికి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
హీరో కార్తీ ‘సర్దార్’ (Sardar) చిత్రం ద్వారా మరోసారి ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశం కోసం పని చేసిన స్పై అదే దేశానికి వ్యతిరేకంగా ఎందుకు మారాడన్నది ఈ మూవీలో ఆసక్తికర అంశం. ‘సర్దార్’ మూవీ తొలి రోజు రూ.1.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఫస్ట్ డే ఇది చాలా పెద్ద రెవెన్యూ కావడం విశేషం.
ఈ విజయం అందించిన ఉత్సాహంతో సీక్వెల్ చేయడానికి కార్తీ అండ్ టీమ్ రెడీ అవుతోంది. చెన్నైలో మంగళవారం జరిగిన 'సర్దార్' సక్సెస్ మీట్ (Sardar Success Meet) లో చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.
'సర్దార్' సీక్వెల్ (Sardar Sequel) షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని తెలుపుతూ ఓ ప్రోమోను విడుదల చేశారు. దీంతో పాటు'ఒక్కసారి గూఢచారి అయితే... ఎప్పుడూ గూఢచారియే' (once a spy always a spy) - #సర్దార్2” అని సర్దార్ నిర్మాతల ట్వీట్ చేశారు.
'సర్దార్ 2' (Sardar 2) కాకుండా కార్తీ చేతిలో ప్రస్తుతం సీక్వెల్స్ ఉన్నాయి. అందులో ముందు చెప్పుకోవాల్సింది 'ఖైదీ 2' గురించి.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం 'ఖైదీ 2' (Kaithi2) ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత 'ఖైదీ 2' ఉండవచ్చు. కార్తీ చేతిలో ఉన్న మరో సీక్వెల్ 'పొన్నియిన్ సెల్వన్ 2'. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.