మహేష్ బాబు (Mahesh Babu)తో రాజమౌళి (rajamouli ss) మూవీ.. విలన్‌గా కోలీవుడ్ హీరో కార్తి (Karthi)?
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (rajamouli ss) తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ఈ మూవీ.. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు మహేష్. ఇది ముగిసిన వెంటనే జక్కన్న ప్రాజెక్టుపై ఆయన ఫోకస్ చేయనున్నారు.
మహేష్‌తో చేయబోయే సినిమా (SSMB29) కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారట. అలాగే చిత్రంలో నటీనటులను కూడా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలో రెండు ప్రతినాయక పాత్రల్లో ఒకదానికి తమిళ స్టార్ హీరో కార్తి (Karthi) పేరును జక్కన్న ఫిక్స్ చేశారట. మహేష్‌ను ఢీకొట్టే విలన్ రోల్ కోసం కార్తీని చిత్ర బృందం సంప్రదించారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు.
రాజమౌళి సినిమాల్లో విలన్స్ రోల్స్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతినాయక పాత్రలను డిజైన్ చేయడంలో జక్కన్నను స్పెషలిస్టుగా చెప్పుకుంటారు. మరి, మహేష్‌తో పాన్ ఇంటర్నేషనల్ మూవీని తెరకెక్కించనున్న ఆయన.. ఏ రేంజ్‌లో విలన్ పాత్రలను డిజైన్ చేస్తారనేది ఊహించుకోవచ్చు. ఒకవేళ ప్రతినాయక పాత్ర కోసం కార్తీని సంప్రదించింది నిజమైతే.. ఇది క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టులో నటిస్తే కార్తి కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది. మరి, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి స్పష్టత వస్తుందేమో చూడాలి.
ఇక, మహేష్‌తో జక్కన్న తీయబోయే సినిమాలో ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోణ్ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు వినికిడి. ప్రస్తుతం దీపిక ‘ప్రాజెక్ట్ కే’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా, మహేష్–జక్కన్న కాంబోలో తెరకెక్కే మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు.
Read more: తారక్ (Jr NTR) భుజాలపై చరణ్ (Ram Charan).. ఫైట్ కంపోజర్ పేరు బయటపెట్టిన జక్కన్న (rajamouli ss)