"స‌ర్దార్‌ను (Sardar Trailer) ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు".. ట్రైలర్ లో గెటప్పులతో అదరగొట్టిన కార్తీ(Karthi)!

Updated on Oct 15, 2022 03:37 PM IST
ఇండియన్ మిలిటరీ ఇంటలిజెన్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ (Sardar Traielr) చూస్తే అర్థమవుతోంది.
ఇండియన్ మిలిటరీ ఇంటలిజెన్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ (Sardar Traielr) చూస్తే అర్థమవుతోంది.

తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ (Sardar). ‘అభిమ‌న్యుడు’ ఫేం పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా (Raashii Khanna), రజీషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, ఈ సినిమా దీపావళికి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హీరో కార్తీ ‘సర్దార్’ (Sardar) చిత్రం ద్వారా మరోసారి ఓ ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. దేశం కోసం పని చేసిన స్పై అదే దేశానికి వ్యతిరేకంగా ఎందుకు మారాడన్నది ఈ మూవీలో ఆసక్తికర అంశం. అయితే, ట్రైలర్‌ ఆసాంతం యాక్షన్‌ సీన్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి.

"స‌ర్దార్‌ను ప‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు.." అనే సంభాష‌ణ‌ల‌తో ట్రైల‌ర్‌ (Sardar Trailer) మొదలయింది. కార్తీ ఇన్ స్పెక్ట‌ర్ విజ‌య్ ప్ర‌కాశ్‌గా స్టైలిష్ ఎంట్రీ ఇవ్వ‌గా.. ప్రాబ్లమ్ ఉందంటే రాడు సార్.. ప్రెస్ ఉందంటే ఖ‌చ్చితంగా వ‌స్తాడు సార్ అంటూ కార్తీ పాత్ర గురించి చెప్తున్న డైలాగ్స్ ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కార్తీ ఇందులో డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపించ‌బోతున్న‌ట్టు ట్రైల‌ర్‌తో చెప్పేశాడు డైరెక్ట‌ర్‌.

మరోవైపు.. ఇండియన్ మిలిటరీ ఇంటలిజెన్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ (Sardar Traielr) చూస్తే అర్థమవుతోంది. కార్తీ పలు విభిన్న లుక్స్ లో కనిపించి, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధుడి గెటప్‌లో కార్తీ లుక్ కేక పుట్టిస్తోంది. జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి, సర్దార్ ఎవరు? పలు రూపాల్లో కనిపించడానికి కారణమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

‘సర్దార్’ (Sardar) చిత్రం తమిళ్, తెలుగుతోపాటు వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించేందుకు మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సంస్థ విడుదల చేస్తోంది.

Read More: కార్తీ నటించిన 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది... ఆ సినిమా తర్వాతే 'ఖైదీ 2' (Khaidi 2) షూటింగ్ స్టార్ట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!