టాలీవుడ్ లో సరికొత్త కాంబో.. 'సర్కారువారి పాట'(Sarkaruvaari Paata) డైరెక్టర్ తో బాల‌కృష్ణ (Balakrishna)సినిమా!

Updated on Oct 31, 2022 12:04 PM IST
'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Urvasivo Rakshasivo Pre Release Event)కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు.
'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Urvasivo Rakshasivo Pre Release Event)కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు.

Nandamuri Balakrishna: టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'సర్కారువారి పాట' సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరశురామ్ తన తర్వాత సినిమాని నందమూరి బాల‌కృష్ణ‌తో ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా పరశురామ్ తెలియజేయడం విశేషం.

తాజాగా నిన్న రాత్రి జరిగిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Urvasivo Rakshasivo Pre Release Event)కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. గీతా ఆర్ట్స్ లో 'శ్రీరస్తు శుభమస్తు', 'గీత గోవిందం' వంటి హిట్స్ చేసిన కారణంగా, ఆ సంస్థతో ఉన్న అనుబంధం కారణంగా పరశురామ్ కూడా ఈ ఫంక్షన్ కి వచ్చాడు.

ఈ ఈవెంట్‌లో 'జై బాల‌య్య' అనే డైలాగ్‌తో స్పీచ్ మొద‌లుపెట్టారు ప‌ర‌శురామ్‌ (Director Parasuram). 'త్వ‌ర‌లోనే ఒక అద్భుత‌మైన క‌థ‌తో మిమ్మ‌ల్ని క‌లుస్తా సార్, ఇప్పటికే అల్లు అర‌వింద్ గారికి కూడా ఈ విష‌యం తెలుసు' అని అన్నాడు.

అయితే క‌థ‌, జోన‌ర్ ఏమిట‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ప‌ర‌శురామ్ (Director Parasuram) అనౌన్స్‌మెంట్‌తో బాల‌కృష్ణ అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బాల‌కృష్ణ హీరోగా న‌టించ‌నున్న 109వ సినిమా ఇదేన‌ని అంటున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర‌సింహారెడ్డి' సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా చేయనున్నారు.

మ‌రోవైపు 'స‌ర్కారువారి పాట' స‌క్సెస్ అనంత‌రం నాగ‌చైత‌న్య‌తో (Nagachaitanya) ఓ ల‌వ్‌స్టోరీ చేయ‌బోతున్న‌ట్లు ప‌ర‌శురామ్ ప్ర‌క‌టించాడు. నాగేశ్వరరావు వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది. అనిల్‌రావిపూడితో బాల‌కృష్ణ చేయ‌నున్న సినిమా పూర్త‌యిన త‌ర్వాత ప‌ర‌శురామ్ సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం.

Read More: తొలిసారి కమర్షియల్ యాడ్ లో నటించి అలరించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!