The Gray Man: హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్' ప్రీమియర్‌‌లో.. తన తనయులతో కలిసి ధనుష్ (Dhanush) గ్రాండ్ ఎంట్ర !

Updated on Jul 15, 2022 08:38 PM IST
'ది గ్రే మ్యాన్' పోస్టర్, కుమారులతో హీరో ధనుష్ (The Gray Man Poster, Hero Dhanush With His Sons)
'ది గ్రే మ్యాన్' పోస్టర్, కుమారులతో హీరో ధనుష్ (The Gray Man Poster, Hero Dhanush With His Sons)

తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. త్వరలో ఆయన హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'ది గ్రే మ్యాన్' (The Gray Man) అనే సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు ధనుష్. యాక్షన్‌ సినిమాల కేరాఫ్ అడ్ర‌స్‌గా పిలువ‌బ‌డే రూసో బ్రదర్స్‌ ఆంటోని, జో ఈ సినిమాను రూపొందించారు. 

అటు హాలీవుడ్‌తో పాటు మన ఇండియాలో కూడా.. ఈ  సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీమియర్స్‌ను వివిధ ప్రాంతాలలో ప్రదర్శించారు. లాస్ ఏంజెల్స్‌లో ఈ కార్యక్రమానికి ధనుష్ తన కుమారులు యాత్ర రాజా, లింగ రాజాతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుమారులతో కలిసి బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో మెరిశారు ధనుష్. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

తండ్రీ కొడుకులు ముగ్గురు ఒకే డ్రెస్ కోడ్ తో...  బ్లాక్, వైట్ అండ్ బ్లూ కాంబినేష‌న్ షూస్‌తో ఈవెంట్‌లోనే  స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఈవెంట్ ఫొటోల‌ను ధ‌నుష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి వైర‌ల్ అవుతున్నాయి. జులై 12న ఎంపిక చేయ‌బ‌డ్డ థియేట‌ర్ల‌లో 'ది గ్రే మ్యాన్' విడుద‌లైంది. నెట్ ఫ్లిక్స్‌లో జులై 22న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని AGBO, Roth Kirschenbaum Films సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో తన భార్య నుంచి ధనుష్ (Hero Dhanush) విడిపోయిన సంగతి తెలిసిందే. ఒక చిన్న హీరోగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు సౌందర్యను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

దాదాపు 18 ఏళ్ళకు పైగా ఎంతో అన్యోన్యంగా... ఆదర్శంగా గడిపిన ఈ జంట ఆ మధ్యే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ విషయంలో ఫ్యాన్స్ షాక్ అవ్వడమే కాదు.. వీరు మళ్ళీ కలవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కాస్త హడావిడి కూడా చేశారు. 

కాగా విభిన్న కథలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాలను చేస్తూ సక్సెస్ బాట పట్టాడు వర్సటైల్ యాక్టర్ ధనుష్. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి, మంచి విజయాలను సాధిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక ధనుష్ కేవలం తెలుగు. తమిళ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ (Bollywood) ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇటీవలే అక్కడ 'అత్రింగేరి' సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

మరోవైపు ధనుష్ తెలుగులోనూ డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' (Sir Movie) అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది. 

Read More: Dhanush: ధనుష్ నటిస్తున్న "ది గ్రే మ్యాన్" చిత్రానికి సంబంధించిన టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!