KGF Chapter 2: రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్న కేజీఎఫ్ చాప్ట‌ర్‌2

Updated on May 29, 2022 08:59 PM IST
KGF Chapter 2:  ఆన్ లైన్ సినిమా బుకింగ్ యాప్ బుక్ మై షో లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
KGF Chapter 2: ఆన్ లైన్ సినిమా బుకింగ్ యాప్ బుక్ మై షో లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

భార‌తీయ సినిమా ప్ర‌పంచంలో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 (KGF Chapter 2) ఓ సంచ‌ల‌నం. య‌శ్ (Yash) హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 ఎన్నో రికార్డుల‌ను బ్రేక్ చేసింది. మ‌రెన్నో రికార్డుల‌ను త్వ‌ర‌లో బ‌ద్ద‌లు కొట్టే దిశ‌గా దుమ్ము లేపుతూ దూసుకెళుతుంది. బుక్ మై షోలో కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 మైండ్ బ్లాక్ చేసే రికార్డుల‌ను సొంతం చేసుకుంది. 

కేజీఎఫ్ చాప్ట‌ర్2 (KGF Chapter 2) సినిమాలో య‌శ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వేల కోట్లను కొల్ల‌గొడుతుంది. ఇక ఆన్ లైన్ బుకింగ్స్‌లోనూ స‌త్తా చాటింది. ఆన్ లైన్ సినిమా బుకింగ్ యాప్ బుక్ మై షో లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 17.1 మిలియ‌న్ల టికెట్లు బుక్ అయ్యాయి. ఆన్ లైన్‌లో ఇంత పెద్ద మొత్తంలో టికెట్లు టికెట్లు అమ్ముడవ్వడం ఓ వండ‌ర్ అంటున్నారు. 

ఆన్ లైన్‌లో ఎక్కువ‌గా కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 (KGF Chapter 2) సినిమాకు టికెట్లు బుక్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆన్ లైన్ బుకింగ్‌లో రెండో స్థానంలో ఉంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు 13.4 మిలియ‌న్ల మంది ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అంత‌కు ముందు బుక్ మై షో లో బాహుబ‌లి2 మొద‌టి స్థానంలో నిలిచింది. ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకోవ‌డంలో హిందీ సినిమాలు 40 శాతం బిజినెస్ చేస్తున్నాయి. త‌మిళ్, తెలుగు సినిమాలకు 20 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడ‌వుతున్నాయి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!