ఓటీటీలో విడుదల కాబోతున్న కోబ్రా ( Cobra) .. చియాన్ విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ పై థియేటర్లలో మిశ్రమ స్పందనలు !

Updated on Sep 12, 2022 06:14 PM IST
కోబ్రా మూవీ ఓటీటీ రిలీజ్‌ (Cobra OTT Release) కోసం విక్రమ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోబ్రా మూవీ ఓటీటీ రిలీజ్‌ (Cobra OTT Release) కోసం విక్రమ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ' చియాన్ విక్రమ్' (Vikram). విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు విక్రమ్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'కోబ్రా'. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఆగస్టు 31వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలయింది. 

కోబ్రా’ (Cobra) రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించడంతో  'ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా' అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమాలో కంటెంట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

Cobra Movie Poster

అయితే ఇప్పుడు ఈ ' కోబ్రా' మూవీ ఓటీటీ రిలీజ్‌ (Cobra OTT Release) కోసం విక్రమ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన వీడియోలో, సోనీ LIV అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది. కోబ్రా తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని ధృవీకరించింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 23 లేదా సెప్టెంబర్ 31 తేదిన డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుందని టాక్. మనం కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తెలుసుకోవాలంటే, మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. 

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ' కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటించింది. సిల్వర్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి, మీనాక్షి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు.

Read More:3D: టెక్నాలజీలో 10 భాషల్లో విడుదల కాబోతున్న 'సూర్య 42' (Suriya 42).. మోషన్ పోస్టర్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!