KGF Chapter 2: ప్రపంచవ్యాప్తంగా మన 'రాకీ భాయ్' కలెక్ట్ చేసిన.. షేర్ విలువ ఎంతంటే?
హీరో యశ్ (Yash), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సృష్టించిన అద్భుత చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లలో వరుసగా, మిగతా సినిమాలను బీట్ చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. వందల కోట్ల రూపాయల కలెక్షన్‌తో దూసుకుపోతోంది. హోంబలే ఫిలిమ్స్, విజయ్ కిరంగన్‌దూర్ భారీ బడ్జెట్‌తో కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటి వరకూ కన్నడ సినిమాల్లో ఇంత బడ్జెట్ పెట్టి, సినిమా ఎవరూ తీయలేదు. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. యశ్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా కేజీఎఫ్ చాప్టర్ 2 లో నటించారు. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.
కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల వివరాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవాల్సిందే. నైజాంలో రూ. 42.78 కోట్లు, సీడెడ్‌లో రూ.11.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.91 కోట్లు, ఈస్ట్‌లో రూ.5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు వసూళ్లు చేసింది ఈ చిత్రం.
ఇక గుంటూరులో రూ. 4.90 కోట్లు, కృష్ణాలో రూ. 4.27 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 83.88 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి 136.16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందన్న మాట.
తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 కాసుల సునామీ సృష్టిస్తోంది. కర్ణాటకలో రూ.104.50 కోట్ల షేర్ వసూళ్లు చేసింది ఈ చిత్రం. అలాగే తమిళనాడులో రూ.54.45 కోట్లు, కేరళలో రూ. 32.02 కోట్లు రాబట్టింది. ఇక హిందీలో వసూళ్ల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. హిందీలో రూ.220.45 కోట్ల షేర్ సాధించి, ఎవరూ ఊహించని రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందీ సినిమా.
ఇతర దేశాల్లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు వచ్చిన షేర్ విలువ, రూ. 98.80 కోట్లుగా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లను లెక్కిస్తే, ఈ సినిమాకి దక్కిన షేర్ విలువ రూ.594.10 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే గ్రాస్ పరంగా రూ.1214.98 కోట్లను కొల్లగొట్టింది ఈ చిత్రం.