పేరు కంటే రెమ్యునరేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా : కేజీఎఫ్ (KGF) హీరోయిన్ శ్రీనిధి శెట్టి

Updated on Jun 04, 2022 02:26 PM IST
కేజీఎఫ్‌2 (KGF)లో శ్రీనిధి శెట్టి
కేజీఎఫ్‌2 (KGF)లో శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్‌ (KGF).. కేజీఎఫ్‌2.. బాక్సాఫీస్‌ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఈ సినిమాతో హీరో యశ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక, ఈ సినిమాలో యశ్ పక్కన హీరోయిన్‌గా చేసిన అమ్మాయి పేరు శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం శ్రీనిధికి సంబంధించి ఒక విషయం నెట్‌లో వైరల్ అవుతోంది. కేజీఎఫ్‌ రెండు భాగాల్లోనూ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసిన శ్రీనిధికి.. రెండో భాగంతో బాగా పాపులారిటీ వచ్చింది.

సాధారణంగా ఒకటి రెండు సినిమాలు హిట్‌ అయిన తర్వాత, హీరోహీరోయిన్లు రెమ్యునరేషన్‌ పెంచుతుంటారు. అది కూడా గత సినిమాలతో పోలిస్తే కొద్దికొద్దిగా పెంచుతారు. అంతేకానీ ఒకేసారి భారీగా రెమ్యునరేషన్ పెంచే ధైర్యం చేయరు. అయితే, ఈ విషయంలో కేజీఎఫ్‌ హీరోయిన్‌ తన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్‌2 సినిమా హిట్ తర్వాత తన రెమ్యునరేషన్‌ను శ్రీనిధి శెట్టి అమాంతం పెంచేసిందని ఇండస్ట్రీ టాక్. స్టార్ హీరోయిన్లకు మించి కాస్త ఎక్కువ రెమ్యునరేషనే ఇవ్వాలని నిర్మాతలను ఒత్తిడి చేస్తోందట. తాను నటించిన 'కేజీఎఫ్' సిరీస్ భారీ విజయం సాధించడం వల్లే శ్రీనిధి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తోందని సమాచారం!

ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ కోసం 'మీకు డబ్బు కావాలా? పేరు కావాలా?' అని యాంకర్ ఓ ప్రశ్న అడిగాడు. దానికి శ్రీనిధి నిర్మొహమాటంగా తనకు డబ్బే ముఖ్యం అంటూ కుండబద్దలయ్యే సమాధానం ఇచ్చిందట. ఈ సమాధానం ప్రకారం శ్రీనిధి శెట్టి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తోంది మరి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!