‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) కలెక్షన్ల సునామీ.. వారం రోజుల్లో 325 కోట్ల వసూళ్లు!

Updated on Oct 07, 2022 06:55 PM IST
మణిరత్నం (ManiRatnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది
మణిరత్నం (ManiRatnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది

ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా పేరొందిన మణిరత్నం (ManiRatnam) తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టుతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.325 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే రూ.130 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. 

తమిళంలో హయ్యస్ట్ గ్రాసర్స్ విషయంలో రజనీకాంత్ మూవీ ‘రోబో 2.0’, కమల్ హాసన్ చిత్రం ‘విక్రమ్’ తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫుల్ రన్‌లో ‘రోబో 2.0’ సినిమా సృష్టించిన రికార్డులను అధిగమించి.. ఇండస్ట్రీ టాప్ హిట్‌గా ‘పొన్నియిన్ సెల్వన్’ నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 

ఓవర్సీస్‌లోనూ ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ మంచి వసూళ్లనే రాబడుతోంది. తమిళంలో ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తుండటంతో తర్వలో పార్ట్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నాళ్లుగానో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న మణిరత్నం.. మొత్తానికి ఈ మూవీతో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారనే చెప్పాలి. 

‘పొన్నియిన్ సెల్వన్’కు తమిళంలో మంచి కలెక్షన్లు వస్తున్నా.. మిగిలిన భాషల్లో వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ చిత్రానికి తెలుగుతోపాటు ఉత్తరాదిన రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు ఈ సినిమాను బాహుబలితో పోల్చడంతో రిలీజైన తర్వాత ఇదే అంశంపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అసలు బాహుబలికి, పొన్నియన్‌ సెల్వన్‌కు పోలికే లేదంటూ విమర్శిస్తున్నారు.

ఇకపోతే, ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం, సుభాస్కరణ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ పాపులర్ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్రాచీన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవితోపాటు ఐశ్వర్యరాయ్, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 

Read more: ఇతర భాషల వారిని దూషించొద్దు.. ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) వివాదంపై కమల్ (Kamal Haasan) స్పందన

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!