కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా నుంచి ‘ఈశ్వరుడే’ లిరికల్ సాంగ్ రిలీజ్

Updated on Jul 14, 2022 12:04 PM IST
కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ సినిమా పోస్టర్
కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ సినిమా పోస్టర్

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) హీరోగా చారిత్రక కథతో తెరకెక్కుతున్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్​ లుక్​, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఈశ్వరుడే ' అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కొత్త కథాంశాలతో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు హీరో క‌ళ్యాణ్‌రామ్‌ . హీరోగానే  కాదు.. పలు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగానూ రాణిస్తున్నారు కల్యాణ్​ రామ్​. తాజాగా ఆయన హీరోగా  నటిస్తూ నిర్మించిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ సినిమా పోస్టర్

పాన్ ఇండియా రేంజ్‌లో..

పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్న 'బింబిసార' సినిమాలో హీరోయిన్స్‌గా కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వం వహించిన బింబిసార సినిమా 'ఎన్టీఆర్ ఆర్ట్స్' పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కఠినమైన శాసనాలను అమలుచేసే బార్బేరియన్ కింగ్ బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఈశ్వరుడే’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. బింబిసారుడి ఔనత్యాన్ని వివరిస్తూ సాగే ఈ పాటకు చిరంతన్ భట్ సంగీతం అందించారు. కీరవాణి కొడుకు కాల భైరవ పాటను ఆలపించారు. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విభిన్నమైన క్యారెక్టర్‌‌లో కళ్యాణ్ రామ్ నటించారని తెలుస్తోంది.

ఆసక్తిని మరింత పెంచుతున్నాయి..

'రాక్షసులు ఎరుగని రావణ రూపం.. శతృవులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడి విశ్వరూపం'.. 'బింబిసారుడు అంటేనే మరణ శాసనం 'తో పాటు..  'ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడు..' అని చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

బార్బేరియన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధిని సొంతం చేసుకోవడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి. వాటి ఆటలను బింబిసారుడుగా జన్మించిన కళ్యాణ్ రామ్ ఏ రకంగా అడ్డుకుని, అంతం చేసాడనేదే సినిమా కథ.

ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. భారీ అంచనాలతో విడుదలకు రెడీ అవుతున్న 'బింబిసార' సినిమాలో కళ్యాణ్‌​ రామ్ (Kalyan Ram )​ నటనను చూడాలంటే ఆగస్టు వరకు ఆగక తప్పదు మరి.

Read More : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో (Vijay Deverakonda) డేటింగ్‌కి సై అంటున్న బాలీవుడ్‌ భామలు.. రౌడీ హీరో రిప్లై వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!