లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన ‘విక్రమ్’ (Vikram) సినిమాకు అరుదైన అవకాశం..!

Updated on Oct 06, 2022 03:31 PM IST
'విక్రమ్' (Vikram) సినిమాలో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.
'విక్రమ్' (Vikram) సినిమాలో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.

తమిళ స్టార్ హీరో, లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల అన్ని భాషల్లో విడుదలై భారీ సక్సెస్ అందుకుంది. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో హీరో సూర్య ఎంట్రీ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఇక, 'విక్రమ్' (Vikram) సినిమాలో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. మరోవైపు.. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే, కొంత కాలంగా కమల్ చేస్తున్న సినిమాలకు భారీ నష్టాలు తప్ప రికవరీ కూడా లేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే యంగ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగరాజ్ తో ఈ చిత్రం కోసం టై అప్ అయి 'విక్రమ్' సినిమాను తెరపైకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. 'విక్రమ్' (Vikram) సినిమా ఓ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. సౌత్ కొరియాలో 'బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' 27వ ఎడిషన్‌లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాలో నిలిచింది. 

1996లో ఈ ఫెస్టివల్స్ ప్రారంభం కాగా ఇప్పటికి 26 ఫిల్మ్ ఫెస్టివల్స్ పూర్తయ్యాయి. ఇక, ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి 14 వరకు ఈ వేడుక జరగనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 7న 'బుసాన్ సినిమా సెంటర్', 8న 'సీజివి సెంటమ్ సిటీ 4' వేదికగా ఈ చిత్రం సందడి చేయనుంది.

కాగా, 'విక్రమ్'కి (Vikram) కొనసాగింపు 'విక్రమ్-2' కూడా రాబోతుంది. దీనికి మూలం 'ఖైదీ' (Khaidi). ఆ సినిమాని  బేస్ చేసుకునే 'విక్రమ్'ని తెరకెక్కించారు. ఇక, ఈ ప్రాంచైజీ నుంచి మరిన్ని చిత్రాలు రానున్నాయి. వాటిలో వివిధ భాషల హీరోలు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: 'విక్ర‌మ్' (Vikram) సృష్టించిన చ‌రిత్ర‌.. 100 ఏళ్ల కోలీవుడ్‌లో టాప్‌లో నిలిచిన‌ క‌మ‌ల్ (Kamal Haasan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!